ఎన్టీఆర్ కి కొత్త అబ్రివేషన్ చెప్పిన హరికృష్ణ.

Hari Krishna said NTR Meaning of National Tiger of Reforms

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
తెలుగు జాతి ఆత్మగౌరవ పతాకంగా నిలిచిన అన్న నందమూరి తారక రామారావు నేటికి 22 ఏళ్ళ కిందటే పరమపదించినా ఇంకా ఆయన గురించి ఏవో కొత్త విషయాలు బయటకు వస్తూనే వున్నాయి. తెలుగు వాడి గుండెల మీద తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్ గొప్పదనం గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా ఏదో ఒకటి మిగిలే ఉంటుంది. ఎన్టీఆర్ ఓ పురోహితుడుగా కవి నాగభైరవ కోటేశ్వరరావు తనయుడు వీరబాబు పెళ్లి జరిపించిన వైనం గురించి నేటి ఆంధ్రజ్యోతిలో వచ్చిన కధనం చూసి ఎందరో ఆశ్చర్యపోయారు. ఇక ఎన్టీఆర్ కి కొడుకుగా పుట్టడమే ఆయన చైతన్య రథానికి సారధిగా వ్యవహరించిన హరికృష్ణ సైతం తండ్రి పేరులోని మూడు అక్షరాలకు సరికొత్త అబ్రివేషన్ ఇచ్చారు.

ఎన్టీఆర్ అంటే నేషనల్ టైగర్ అఫ్ రిఫార్మ్స్ అంటూ హరికృష్ణ తండ్రి గురించి సరికొత్తగా చెప్పారు. నేడు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఎన్నో రాష్ట్రాల్లో అమలు అవుతున్న సంక్షేమ పథకాలకు ఎన్టీఆర్ నాడు తీసుకున్న నిర్ణయాలే స్ఫూర్తి ,మార్గదర్శకం అని హరికృష్ణ చెప్పారు. హరికృష్ణ కొడుకు జూనియర్ ఎన్టీఆర్ ని యంగ్ టైగర్ అని పిలుస్తారు. ఇప్పుడు తండ్రికి కూడా టైగర్ అని అర్ధం వచ్చేలా హరికృష్ణ ఇచ్చిన అబ్రివేషన్ గురించి కొందరు ఈకలు, తోకలు పీకే పని అప్పుడే మొదలు పెట్టేసారు.