కుమారి 21ఎఫ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యి అందరిని అలరించిన ముద్దుగుమ్మ హెబ్బా పటేల్. ఈ అమ్మడు ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి సక్సెస్, ఫ్లాప్‌లతో బాగానే పాపులర్ అయ్యింది. అయితే గత సంవత్సర కాలంగా ఈమెకు పెద్దగా ఆఫర్లు దక్కడం లేదు. అయినా కూడా ఈమె తనవంతు ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. తెలుగులో ఈమెకు ఛాన్స్‌లు దక్కకపోవడంతో తమిళంలో కూడా ప్రయత్నాలు చేసింది. అక్కడ కూడా ఈమె నిరాశనే చవి చూసింది. ఇలాంటి సమయంలోనే హెబ్బా పటేల్ తెలుగు బిగ్‌బాస్ సీజన్ 2లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా అంతా భావిస్తున్నారు. కుమారి 21 ఎఫ్ చిత్రం తర్వాత సాలిడ్ సక్సెస్ లేని హెబ్బా పటేల్‌కు బిగ్‌బాస్‌తో లక్ తిరిగి వస్తుందేమో అని అంతా భావించారు.
బిగ్‌బాస్‌లో హెబ్బా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా బాగుటుందని, బిగ్‌బాస్‌కు మరియు హెబ్బాకు కూడా ఉపయోగదాయకం అంటూ అంతా భావించారు. కాని హెబ్బా పటేల్ మాత్రం తాను బిగ్‌బాస్ ఇంటికి వెళ్లడం ఏంటీ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. నేను మా ఇంట్లోనే ఉన్నాను. మరెవ్వరి ఇంట్లోకి నేను వెళ్లదల్చుకోవడం లేదు, వెళ్లే ఆలోచన కూడా నాకు లేదు అంటూ తెల్చి చెప్పింది. నాకు బిగ్‌బాస్ నుండి కాల్ రాలేదు, ఎవరు నన్ను సంప్రదించలేదు అంటూ చెప్పుకొచ్చింది. బిగ్‌బాస్ సీజన్ 2లో రెండవ వైల్డ్ కార్డ్ ఎంట్రీ హెబ్బా పటేల్ ఉంటుందని ఆశించిన ప్రేక్షకులు నీరుగారి పోయారు. మరి ఇప్పుడు రెండవ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరు అయ్యి ఉంటారో అనేది చూడాలి. వచ్చే వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండే అవకాశం ఉంది.