పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ చిత్రంలో అను ఎమాన్యూల్ హీరోయిన్ అనగానే అందరి దృష్టి ఆమెపై పడ్డింది. ఆ చిత్రం తర్వాత అను ఎమాన్యూల్ స్థాయి అమాంతం పెరగడం ఖాయం అని, ఖచ్చితంగా అజ్ఞాతవాసితో ఆమె స్టార్‌డంను దక్కించుకుంటుందని అంతా అనుకున్నారు. కాని అను ఎమాన్యూల్‌కు ఆ చిత్రం ఏమాత్రం క్రేజ్‌ను తెచ్చి పెట్టలేక పోయింది. ఆ తర్వాత వచ్చిన ‘నా పేరు సూర్య’ చిత్రంతో కూడా ఆమెకు ఏం కలిసి రాలేదు. నా పేరు సూర్య సమయంలోనే నాగచైతన్యకు జోడీగా ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుంది. త్వరలో శైలజ రెడ్డి అల్లుడు చిత్రం విడుదల కాబోతుంది. శైలజ రెడ్డి అల్లుడు సినిమా ఫలితంపై అను ఎమాన్యూల్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. తాజాగా ఆ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా అను ఎమాన్యూల్ మాట్లాడుతూ గీత గోవిందం చిత్రం గురించి ప్రస్థావించింది.
గీత గోవిందం దర్శకుడు పరుశురామ్ తన వద్దకు వచ్చిన సమయంలో తిరష్కరించాను అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఒక మంచి సినిమాను మిస్ చేసుకున్నందుకు ఇప్పుడు బాధ పడుతున్నట్లుగా ఆమె పేర్కొంది. గీత గోవిందం చిత్రంలో హీరోయిన్‌గా రష్మిక మందన నటించడంతో ఆమె స్థాయి అమాంతం పెరిగింది. గీత గోవిందం తర్వాత రష్మిక ఏకంగా కోటి పారితోషికంను డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అను ఎమాన్యూల్ హీరో విజయ్ దేవరకొండకు పెద్దగా గుర్తింపు లేదు అనే ఉద్దేశ్యంతో ఆ సినిమాను వదిలేసింది. అనును దర్శకుడు సంప్రదించిన సమయంకు అర్జున్ రెడ్డి విడుదల కాలేదని తెలుస్తోంది. అర్జున్ రెడ్డి విడుదలైతే ఖచ్చితంగా అను ఎమాన్యూల్ వచ్చిన ఛాన్స్ వదిలేయకుండా ఖచ్చితంగా గీతగా నటించేది. వరుసగా ఫ్లాప్‌లు రావడంతో ఈమెను ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రం నుండి తప్పించిన విషయం తెల్సిందే.