సదావర్తి భూములు ఆర్కే కే… ఏపీ సర్కార్ కి షాక్.

sadavarti lands belongs to Alla Ramakrishna Chandrababu shocked

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
చెప్పులోని రాయి చెవిలోని జోరీగ, పంటి కింద రాయి, చంద్రబాబుకి ఆర్కే… ఈ పోలిక కాస్త చిత్రంగా ఉన్నప్పటికీ చాలా సందర్భాల్లో ఇది నిజమే అనిపిస్తోంది. రాజకీయాలకు కొత్తవాడైనా మంగళగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచినప్పటినుంచి ఆర్కే వివిధ సందర్భాల్లో సీఎం చంద్రబాబుకి తలనొప్పి తెప్పించడంలో సక్సెస్ అయ్యారు. అయోధ్య రామిరెడ్డి సోదరుడిగా పార్టీ లో పరిచయమైన ఇతని మీద మొదట్లో పెద్ద అంచనాలు ఏమీ లేవు. అయితే న్యాయపోరాటాన్ని ఓ మార్గంగా ఎంచుకున్న ఆర్కే రాజకీయంగా టీడీపీ సర్కార్, చంద్రబాబుని బాగానే ఇబ్బంది పెడుతున్నారు. ఓటుకునోటు కేసులో చంద్రబాబుని సుప్రీమ్ కోర్ట్ దాకా లాగారు. ఇక మున్సిపల్ వార్డు ఉప ఎన్నికల్లో మంగళగిరిలో ఓ స్థానాన్ని గెలుచుకుని టీడీపీ కి షాక్ ఇచ్చారు. ఇప్పుడు అధికార పార్టీ కి ఇంకో ఝలక్ ఇచ్చారు.

అప్పట్లో పెద్ద రచ్చ జరిగిన సదావర్తి భూముల వేలం కేసులో ఏపీ సర్కార్ ఊహించని పరిణామం ఎదురైంది. తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో సదావర్తి సత్రానికి సంబంధించి 84 ఎకరాల భూమి వుంది. ఆ భూమిని ఏపీ సర్కార్ అయిన వారికి కేవలం 22 కోట్లకు కట్టబెట్టిందని ఎమ్మెల్యే ఆర్కే హై కోర్ట్ ని ఆశ్రయించారు. ఆ భూమి విలువ దాదాపు 1000 కోట్లు ఉంటుందని అప్పట్లో సాక్షి పత్రిక రాసింది. ఆ తర్వాత ఆ పార్టీ నేతలు ఓ నిజనిర్ధారణ కమిటీని కూడా అక్కడికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో సదావర్తి భూముల వేలం సక్రమంగానే జరిగిందని, అంతకన్నా 5 కోట్లు ఎవరైనా ఎక్కువ ఇస్తే వారికి భూములు అప్పగిస్తామని రాష్ట్రప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టుకి విన్నవించారు. అందుకు ఎమ్మెల్యే ఆర్కే సంసిద్ధత వ్యక్తం చేయడంతో ఉమ్మడి హై కోర్ట్ కీలక తీర్పు వెలువరించింది. ఆ తీర్పుతో 5 కోట్లు ఎక్కువ చెల్లించడానికి ముందుకు వచ్చిన ఆర్కే కి ఆ భూములు దక్కబోతున్నాయి. రెండు వారాల్లో పది కోట్లు, నాలుగు వారాల్లో మిగిలిన 17 .44 కోట్లు చెల్లించాలని హై కోర్ట్ పేర్కొంది. ఈ పరిణామం ఏపీ సర్కార్ కి పెద్ద ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి.

 మరిన్ని వార్తలు 

సిన్సియారిటీకి యోగి బహుమానం