Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అమెరికా అంటే అగ్రరాజ్యం. చాలా టెక్నాలజీ ఉంటుంది. కానీ మొన్న వచ్చిన హరికేన్ హార్వే దెబ్బకు టెక్సాస్ రాష్ట్రం చిగురుటాకులా వణికిపోయింది. చరిత్రలో ఎప్పుడూ లేనంత నష్టం చేసింది హార్వే. హార్వే దెబ్బకు అమెరికాలో తొలిసారిగా స్వచ్ఛంద సంస్థలు విరాళాలు ప్రకటించాల్సిన అవసరం ఏర్పడింది. స్వయంగా అధ్యక్షుడు ట్రంప్ కూడా వ్యక్తిగత ధనం నుంచి విరాళం ప్రకటించారు.
టెక్సాస్ లో రోడ్లన్నీ నదులయ్యాయి. నదులు వరదలయ్యాయి. వరదలు ఉప్పొంగాయి. ఇళ్లను ముంచేశాయి. ఒక మహా నగరం కాస్తా.. పెద్ద ద్వీపాల సముదాయంగా మారిపోయింది. వరద నీటిలో పడవలు వేసుకుని తిరగాల్సిన పరిస్థితి. ఇప్పటికీ అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో బాధితుల్ని ఆదుకోవడానికి సహాయక బృందాలు వెళ్లలేని పరిస్థితి.
అమెరికాలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు. మన దగ్గరంటే వరదలు వచ్చినప్పుడల్లా బాధితుల ఆర్తనాదాలు మామూలే. కానీ అమెరికాలో ఎంత తీవ్ర తుఫాను వచ్చినా 24 మహా అయితే 48 గంటల్లో పరిస్థితి అదుపులోకి వస్తోంది. కానీ హార్వే తర్వాత మాత్రం సీన్ మారిపోయింది. వరదనీరు ఇంకా ఇళ్లమధ్యలోనే ఉంది. అందుకే హార్వే కారణంగా ఎప్పుడూ లేనంత నష్టం వాటిల్లిందని అమెరికా లెక్కలేసుకుంటోంది.
మరిన్ని వార్తలు: