తెలుగులో పుష్కర కాలంగా స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ శ్రియ. తెలుగులో దాదాపు స్టార్ హీరోల అందరితో కూడా నటించేసిన ముద్దుగుమ్మ శ్రియకు గత కొంత కాలంగా సరైన ఆఫర్లు రావడం లేదు. దాంతో ఈ అమ్మడు నిరాశలో ఉంది. ఈ సమయంలోనే ఈమె ప్రేమించిన ప్రియుడిని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు శ్రియ పూర్తిగా దూరం అవుతుందని అంతా భావించారు. కాని పెళ్లి అయినా కూడా నటనను వదిలి పెట్టేది లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. ముందు నుండి చెబుతున్నట్లుగానే నటన తన జీవితంలో ఎప్పుడు ఉంటుందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె తమిళంలో ఒక చిత్రాన్ని చేస్తుంది. ఈ సమయంలోనే పెళ్లి అయ్యింది కదా, మరి పిల్లలు ఎప్పుడు అంటూ ప్రశ్నించారు. పిల్లల విషయంలో విచిత్రమైన స్పందన శ్రియ నుండి వచ్చింది.
పిల్లల విషయంలో తనకు ఎలాంటి హడావుడి లేదని, ప్రస్తుతానికి సినిమాలతోనే బిజీగా గడపాలని భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. హీరోయిన్‌గా మరో 20 నుండి 25 చిత్రాలు చేసిన తర్వాతే తాను పిల్లల విషయంలో ఆలోచిస్తాను అంటూ పేర్కొంది. ప్రస్తుతం ఉన్న ఈమె క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుంటే 20 నుండి 25 చిత్రాల్లో ఇప్పట్లో అయ్యే అవకాశం లేదు. ఖచ్చితంగా ఈమె చేస్తున్న సినిమాల తర్వాత ఇతర సినిమాల్లో ఆఫర్లు వస్తాయనే నమ్మకం లేదు. ఇలాంటి సమయంలో కండీషన్స్ పెట్టుకుని, తనకు తాను టార్గెట్ పెట్టుకుని పిల్లలను వాయిదా వేయడం మంచి పద్దతి కాదు అంటూ సినీ వర్గాల వారు మరియు ఆమె సన్నిహితులు అంటున్నారు. శ్రియ ప్రస్తుత పరిస్థితుల్లో 10 సినిమాల్లో నటించడం కూడా సాధ్యం అయ్యే పని కాదు అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. తాను అనుకున్న మాట మీద ఈ అమ్మడు నిలుస్తుందా లేదా అనేది చూడాలి.