Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నంద్యాల ఉపఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకుని. వైసీపీ అధినేత జగన్ ఎన్ని పోరాటాలు చేసినా ఫలితం లేకపోయింది. రాజకీయ ఉద్దండులే నువ్వా నేనా అన్నట్టు భావించిన ఈ ఎన్నికల్లో ఫలితాలు వచ్చేసరికి వైసీపీ తేలిపోయింది. ఆది నుంచి టీడీపీ ఆధిక్యం స్పష్టంగా కనిపించింది. తొలి రౌండ్ నుంచే టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఆధిక్యత కొనసాగింది. ఈ ఫలితంతో వైసీపీ శ్రేణులు తీవ్ర నిరాశకి గురయ్యాయి. ఆ నిస్తేజంలో వైసీపీ సీనియర్ నాయకుడు ఒకరు ఓ పచ్చి నిజం చెప్పాడు. నంద్యాల ఎన్నికల్లో ఓడిపోతే 2019 ఎన్నికల్లో గెలవడమే కష్టమని ఆ నాయకుడు అభిప్రాయపడ్డాడు.అందుకు కారణాలు కూడా విశ్లేషించాడు.
నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం చరిత్ర పరిశీలిస్తే అది టీడీపీ కి అంతగా ఆదరణ వున్న ప్రాంతం కాదు. అక్కడ సామాజిక వర్గాల వారీగా చూసినా పరిస్థితి టీడీపీ కి ప్రతికూలమే . ఫరూక్ మాత్రమే రెండు సార్లు టీడీపీ తరపున అక్కడ గెలిచారు. ఇప్పుడు చంద్రబాబు సర్కార్ మీద ప్రజల్లోనూ అపార ఆదరణ ఏమీ లేదు. అయినా అక్కడి ప్రజలు చంద్రబాబు నాయకత్వం మీద నమ్మకం ఉంచారంటే జగన్ ని ఇంకా నమ్మడం లేదన్న మాట. ఈ పరిస్థితుల్లో నంద్యాల లాంటి సీట్ గెలుచుకోకపోతే 2019 లో గెలుపు అసాధ్యం అని ఆ నాయకుడు చెప్పడం భవిష్యత్ లో ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది.
మరిన్ని వార్తలు: