Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. పశ్చిమ సరిహద్దుతో పాటు తూర్పు సరిహద్దులో కూడా చైనా కయ్యానికి కాలు దువ్వుతోంది. ఇప్పటికే చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్న పాక్, చైనాలు ఎవరితో వార్ వచ్చినా… ఇద్దరితోనూ జాయింట్ వార్ కు రెడీగా ఉన్నామంటోంది భారత్. కానీ నిజంగా అది వాస్తవమేనా. మన దగ్గర అంత ఆయుధ సంపత్తి ఉందా ఆనే ప్రశ్న సామాన్యుల్ని వేధిస్తోంది. బీజేపీ సర్కారుకు గొప్పలు అలవాటయ్యాయి కాబట్టి అలాగే అంటారనే భావన కూడా ఉంది.
కానీ 1962 చేదు అనుభం తర్వాత మన సైన్యం ఎంతో మెరుగుపడిందన్న మాట వాస్తవం. అప్పట్లో పంచశీల పేరుతో సైన్యాన్ని నిర్వీర్యం చేశారు కానీ… ఎప్పుడైనా మన సైనికుల సాహసానికి ఎవరూ పోటీ కాదు. అయినా సరే చైనా సైన్యం చాలా పెద్దది. వారిని ఎదిరించి నిలబడాలంటే బుర్ర పెట్టి యుద్ధం చేయాల్సి ఉంటుంది. అందుకే ఆర్మీ చీఫ్ బ్రెయిన్ గేమ్ మొదలెట్టారు. పాకిస్థాన్ సంగతి సరే సరి. చైనాను గట్టిగా దెబ్బతీస్తే… పాక్ ఆటోమేటిగ్గా తోక ముడుస్తుందనేది మన వ్యూహకర్తల భావన.
చైనా ఆర్మీ బలమైనదే అయినా… మనకూ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. క్షిపణులు, టెక్నాలజీ పరంగా చైనా కంటే మనది కాస్త పైచేయి. పైగా మనకు పరోక్షంగా సహకరించే దేశాలు చాలా ఉన్నాయి. చైనాకు పరోక్షంగా కానీ, ప్రత్యక్షంగా కానీ సహకారం అందడం కల్లో మాట. అమెరికా, ఇజ్రాయెల్, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, జర్మనీ లాంటి అగ్రదేశాలు మనకే మద్దతిస్తాయనేది ఓ అంచనా. అలాగే మనతో చైనాకు యుద్ధం వస్తే జపాన్ కూడా ఓ చేయి వేస్తుందని ఢిల్లీ ఆలోచిస్తోంది. ఈసారి చైనాతో వార్ వస్తే డ్రాగన్ కు తగిన బుద్ధి చెప్పాలని ఇండియానే కాదు… అన్ని దేశాలూ పట్టుదలగా ఉన్నాయి.
మరిన్ని వార్తలు