Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా బిగ్బాస్ షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పార్టిసిపెంట్ చేసేందుకు సిద్దం అవుతుందని, స్టార్ మాటీవీ వారు షోను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు ఇంకా పలువురు సెలబ్రెటీలను బిగ్బాస్ ఇంట్లోకి పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అయితే బిగ్బాస్ హౌస్లోకి పంపించేందుకు మరే సెబ్రెటీలు దొరకలేదా, ఎవరు లేనట్లుగా ఆమెను ఎంపిక చేయడం ఏంటని కొందరు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు పెద్దగా క్రేజ్ లేదు, దానికి తోడు ఆమె నటించిన ఒక్కగానొక్క సినిమా కూడా సక్సెస్ కాలేదు. అయినా కూడా ఆమెకు ఎందుకు ఛాన్స్ ఇస్తున్నారని సాదారణ ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు.
మరో వైపు బిగ్బాస్ షోలో గుత్తా జ్వాలా ఎంట్రీ పుకార్లే అయ్యి ఉంటాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పార్టిసిపెంట్లతోనే షోను రన్ చేస్తున్నారని, కొత్తగా ఆ ఇంట్లో జాయిన్ అయ్యేందుకు స్కోప్ లేదని, ఇవన్ని ఎవరో కావాలని పుట్టిస్తున్న పుకార్లుగా తెలుస్తోంది. పబ్లిసిటీ వస్తుందన్న కారణంగా షో నిర్వాహకులు ఈ విషయమై ఏం స్పందించడం లేదు. బిగ్బాస్ షోతో తెలుగు రాష్ట్రాల్లో స్టార్ మాటీవీ నెం.1 స్థానంకు చేరింది. దాంతో షోను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు నిర్వాహకులు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో ఇది ఒకటేమో చూడాలి. గుత్తా జ్వాలాతో పాటు మరో ఇద్దరు సినీ ప్రముఖులు కూడా బిగ్బాస్ ఇంటికి వెళ్తారనే ప్రచారం జరగుతుంది. ఆ విషయంలో కూడా క్లారిటీ రావాల్సి ఉంది.
మరిన్ని వార్తలు
పైసా వసూల్ స్టంపర్ అదిరిందిగా… వీడియో
గౌతమ్ నంద… తెలుగు బులెట్ రివ్యూ.
స్టార్ మాను నెం.1 చేసిన బిగ్బాస్