మన టాలీవుడ్ టాలెంటెడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి చాలా కాలం తర్వాత చేసిన చిత్రం “మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి” తో సాలిడ్ కంబ్యాక్ ని ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనితో అనుష్క నెక్స్ట్ సినిమా ఏంటి అనేది ఆసక్తిగా మారింది. అయితే ఈ సినిమా విషయంలో అప్పట్లోనే ఇంట్రెస్టింగ్ వార్తలు వచ్చాయి. వాటిలో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ అంటూ ఒక టాక్ వచ్చింది . ఈ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ పైనే ఇప్పుడు న్యూస్ వినిపిస్తోంది .
అనుష్క నెక్స్ట్ క్రిష్ దర్శకత్వంలో సహా తన హోమ్ బ్యానర్ లో మొదటి సారి నటించబోతుంది అని ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. అలాగే ఈ సినిమాకి యూవీ క్రియేషన్స్ వారు కూడా నిర్మాణం వహించనున్నారట. ఇక ఈ కాంబినేషన్ పై ఈ నెలలోనే అఫీషియల్ క్లారిటీ రానున్నట్లు సమాచారం.