ఆ సినిమా రికార్డ్ ను బ్రేక్ చేసిన ‘ఇంటిలిజెంట్’…

Inttelligent Movie Collections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగా మేనల్లుడు ‘సాయిధరమ్ తేజ్’… మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ హీరో, తక్కువ కాలంలోనే తన స్టైల్ మరియు నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. వైవీఎస్ చౌదరి నిర్మాణ, దర్శకత్వంలో వచ్చిన ‘రేయ్’ సినిమాతో ‘సాయిధరమ్ తేజ్’ తెలుగు తెరకు పరిచయం అయ్యాడు… కానీ అనుకోని కారణాలు వలన ఆ సినిమా వాయిదా పడటంతో ‘పిల్లా నువ్వు లేని జీవితం’ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అప్పట్లో వైవీఎస్ చౌదరి ‘రేయ్’ సినిమాకు రూ.35 కోట్ల దాకా పెట్టుబడి పెట్టి దారుణంగా నష్టపోయాడు. ఆ సినిమా ఫుల్ రన్లో రూ.5-6 కోట్ల వసూళ్లు మాత్రమే రాబట్టగలిగింది. ఆ ప్లాఫ్ తో వైవీఎస్ చౌదరి ఇప్పటి వరకు కోలుకోలేదు. రేయ్ సినిమా తరహాలో మరే సినిమా ప్లాప్ కాదు అని అనుకున్నారు. ‘తిక్క’ సినిమా ఆ రికార్డ్ ని బ్రేక్ చేస్తుందేమో అనుకున్నారు అందరు, కానీ ‘సుప్రీమ్’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ వరుస హిట్స్ ఉండటం వలన ‘తిక్క’ మూవీ కొంచెం సేఫ్ అయింది. కానీ ఎన్నో అంచనాల మధ్య విడుదల అయిన ‘ఇంటిలిజెంట్ ‘ సినిమా ‘రేయ్’ సినిమా రికార్డ్స్ ని బద్దలు కొట్టేలా ఉంది.

‘జై సింహ’ హిట్ తర్వాత సి. కళ్యాణ్ నిర్మిస్తున్న సినిమా అవ్వటం వలన, మరియు ఖైదీ నెంబర్ 150 తర్వాత వివి వినాయక్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ‘ఇంటిలిజెంట్’ పై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి… అన్ని అంచనాలు ఉండటం వలన వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ మూవీ కుడా వాయిదా వేసుకున్నాడు. కానీ ‘ఇంటిలిజెంట్’ సినిమా విడుదల అయిన తర్వాత, ఆ సినిమా ప్లాఫ్ టాక్ రావడంతో ఆ అంచనాలు తారుమారయ్యాయి. ఈ పరిస్థితుల్లో కనీసం రేయ్ సినిమా వసూళ్ళను కుడా దాటేలా కనపడటం లేదు ఈ సినిమా. రేయ్ సినిమా తొలి వారంలో రూ.3.13 కోట్లు షేర్ వసూళ్ళు చేసింది. కానీ ‘ఇంటిలిజెంట్’ సినిమా తొలి వారాంతంలో ఆ స్థాయి వసూళ్లను కుడా రాబట్టలేకపోతుందంటే అర్ధం చేసుకోవచ్చు. అది ఏ స్థాయిలో డిజాస్టర్ గా నిలిచిందో. ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే ‘రేయ’ సినిమా ప్లాఫ్ రికార్డ్ను ‘ఇంటిలిజెంట్’ సినిమా బద్దలు కొట్టే అవకాశం కనపడుతుంది.