Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
“ఊరంతా ఒక దారి అయితే ఉలిపి కట్టెది ఇంకో దారి “ అన్న పాత నానుడిని నిజం చేసి చూపిస్తున్నారు ఐవైఆర్ కృష్ణారావు గారు. చంద్రబాబు సర్కార్ సీఎస్ పదవితో పాటు ప్రత్యేకంగా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గిరీ ఇచ్చినందుకు ఎలా బదులు తీర్చుకున్నారో లోకమంతా చూసింది. పదవులతో పాటు విచక్షణ కూడా కోల్పోయిన ఆయన అప్పటినుంచి చంద్రబాబు సర్కార్ కి వ్యతిరేకంగా నానా యాగీ చేస్తూనే వున్నారు. తాజాగా విభజన సమస్యల మీద కేంద్రంతో రాష్ట్ర ఎంపీ లు పోరాటం చేస్తున్న విషయంలోనూ ఐవైఆర్ వేలు పెట్టారు. కేంద్ర వైఖరి మీద ఆంధ్రులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు అని గుర్తించి ఈ లొల్లికి కారణం అయిన ఏపీ బీజేపీ నాయకులే సైలెంట్ అయిన ప్రస్తుత తరుణంలో ఐవైఆర్ సాక్షి కోసం ఎడిట్ పేజీలో ఓ వ్యాసం రాశారు.
సాక్షిలో ఐవైఆర్ ఏమి రాసారో చదివితే చాలు ఆంధ్రులు పిచ్చివాళ్ళని ఈయన బలంగా నమ్ముతున్నట్టు అనిపించక మానదు. “విభజన వాగ్దానాల అమలులో కేంద్ర ప్రభుత్వ చర్యలు మరీ అంత గొప్పగా లేకపోయినా తీసేసే స్థాయిలో మాత్రం లేవు. కానీ రాష్ట్ర ప్రభుత్వం చాలా అంశాల్లో సంకుచిత దృక్పధంతో వ్యవహరిస్తూ ఉండటమే అన్ని అనర్ధాలకు కారణం అవుతోంది “. ఇదీ ప్రస్తుత పరిణామాల మీద ఐవైఆర్ సూత్రీకరణ. సరే ఐవైఆర్ గారు ఏదో వ్యక్తిగత కోపంతో ఈ పని చేశారు అనుకున్నా అదే పాయింట్ ని హైలైట్ చేస్తూ సాక్షి కూడా తన మనసులో మాట ఏమిటో బయటపెట్టుకుంది. ఈ వ్యవహారం చూస్తుంటే కళ్ళు మూసుకుని పాలు తాగుతున్న పిల్లి గుర్తుకు రావడం లేదూ!.