వైసీపీ అధినేత మరియు ఏపీ రాష్ట్ర ముఖ్య మంత్రి వై ఎస్ జగన్ పరిపాలన ఊహించిన స్థాయిలో ఉందో లేదో ప్రజలు ఇప్పటికే గమనించారు కానీ తన రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం మాత్రం జగన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలను ఖచ్చితంగా మెచ్చుకొని తీరాలని చెప్పాలి.
అలా గత కొన్నాళ్ల క్రితం తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అదే ఇంగ్లీష్ మీడియం విషయంపై.. ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం తప్పని సరి అని చెప్పి తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర హై కోర్టు కొట్టి పారెయ్యడంతో వైసీపీ అధిష్ఠానం పూర్తి నిరాశతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దీనితో ఇక్కడ దెబ్బ తిన్నా సుప్రీం కోర్టు వరకు వెళ్ళడానికి కూడా సిద్దమే అని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివితేనే వారి భవిష్యత్తు బాగుంటుదని జగన్ ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. ఏది ఏమైనప్పటికీ మాత్రం జగన్ ఈ విషయంలో ఎక్కడా తగ్గేలా లేరని చెప్పాలి.