కీలక నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

కీలక నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

భారత్ లోని రెండు తెలుగు రాష్ట్రాల్లో భయంకరమైన మహమ్మారి దారుణంగా వ్యాపిస్తున్న తరుణంలో మన ప్రభుత్వాలు ఈ మహమ్మారిని అరికట్టడానికి ఎన్నో కీలకమైన చర్యలను చేపట్టాయి. మన ప్రభుత్వాలు తీసుకున్న ఈ కఠినమైన చర్యల వలన ఎంతో కొంత ఈ కరోనా ని కట్టడి చేయగలిగామని అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు ఇప్పటికి కూడా కరోనా ని దరిచేయనీయలేదని చెప్పుకోవాలి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా మరొక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. కాగా త్వరలోనే విశాఖ పట్టణాన్ని కరోనా ఫ్రీ పట్టణంగా ప్రకటించనున్నట్లు సమాచారం.

అయితే ఇప్పటివరకు కూడా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాకపోవడం, ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తున్న సహాయ సహకారాలకి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా విశాఖ పట్టణంలో గతంలో నమోదైనటువంటి 20 కేసులు మినహా, తరువాత మరేఇతర కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడంతో ప్రజలందరూ కూడా కాస్త కోలుకుంటున్నారని సమాచారం. ఇకపోతే వీరిలో ఇప్పటికే 4 మంది బాధితులు పూర్తిగా కోలుకొని, ఆసుపత్రుల నుండి డీఛార్జ్ అయ్యారని, మిగతా వారు కూడా పూర్తిగా కోలుకుంటున్నారని రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు.