Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
లోకేష్ ని జగన్ అనుకూల మీడియా ఎంతగా వాడేసుకుందో, ఆడేసుకుందో అందరం చూశాం. ఓ విధంగా చెప్పాలంటే లోకేష్ ప్రసంగాల్ని శల్య పరీక్ష చేసి పారేశారు. మాట తడబడితే చాలు, పొరపాటుగా మాట్లాడితే చాలు… అదేదో నేరం, ఘోరం అన్నట్టుగా సోషల్ మీడియాలో చాకిరేవు పెట్టేసి ఉతికి ఆరేశారు. ఇప్పుడు అదే జగన్ విషయంలోనూ జరిగింది. గరగపర్రు వివాదాల్లో దళితుల్ని పరామర్శించడానికి వెళ్లిన జగన్ “బాధితుల్ని” అప్పుడే అరెస్ట్ చేసి ఉంటే సమస్య ఇక్కడి దాకా వచ్చేది కాదన్నారు. “బాధితుల్ని”అరెస్ట్ చేయడం ఏంటని మొన్నటిదాకా లోకేష్ మీద వైసీపీ సోషల్ మీడియా దాడితో ఉక్కిరిబిక్కిరి అయిన టీడీపీ ఎదురు దాడికి దిగింది. దీంతో జగన్ కి ఫ్యుజ్ లు ఎగిరిపోయాయి. కానీ ఇప్పుడు జగన్ ని అయినా, ఇంతకు ముందు లోకేష్ ని అయినా అంతగా చీల్చిచెండాడాల్సిన పనిలేదు.
మాట తడబడడం సర్వసాధారణం విషయం అని ఇప్పుడు సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న వాళ్ళు అందరికీ తెలుసు. అయినా ఏదో ఘోరం జరిగిపోయినట్టు వీళ్ళు చేసే హడావిడికి అసలు విషయాలు జనం ముందుకు రాకుండా పోతున్నాయి. రాజకీయాలు విధానాల మీద జరిగితే ప్రజలకు కాస్త అయినా మేలు జరుగుతుంది తప్ప ఇలాంటి చిన్న చిన్న వ్యక్తిగత బలహీనతల మీద దృష్టి పెట్టి ప్రత్యర్థిని జనం ముందు పలచన చేస్తే అదే పరిస్థితి మనకూ రావొచ్చు. ఇప్పుడు జగన్ కి జరిగింది అదే. ఇకనైనా ఆయన తత్వం బోధపడి రూట్ మార్చుకుంటాడో లేక చేతిలో సాక్షి, అనుకూల సోషల్ మీడియా ఉందని చెలరేగిపోతాడో? కానీ రోజులు ఎప్పుడూ ఒకేలా ఉంటాయా ? జగన్ కి మాత్రం మాట తడబడదా?
మరిన్ని వార్తలు
జగన్ కి సౌండ్ పొల్యూషన్ పడదంట.
చెప్పులు కుట్టిన ఏపీ మంత్రి.
గరగపర్రు వివాదంలో కొత్త కోణం.