Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ని ఆదర్శంగా తీసుకుని 2019 ఎన్నికల్లో జయకేతనం ఎగురవేయాలని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారు. ఇంతకీ ఏ విషయంలో ఒబామా ని జగన్ స్ఫూర్తిగా తీసుకుంటున్నాడో తెలుసా?. ఎన్నికల వ్యూహం విషయంలో. 2012 అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంలో ఒబామా వ్యూహకర్తల బృందం ఓ అరుదైన ప్రణాళిక రూపొందించింది. అదే మైక్రో టార్గెటింగ్ అప్రోచ్. అంటే విధానపరంగా వివిధ వర్గాలను ఒకే పార్టీ వైపు ఆకర్షించడంతో పాటు అన్ని వర్గాలకు తగు ప్రాధాన్యం ఇవ్వడం. ఈ పద్ధతిని ఎన్నికల్లో వివిధ కులాలు, మతాలు వుండే భారతదేశంలో ఎప్పటినుంచో వినియోగిస్తున్నారు. అయితే ఒబామా వ్యూహకర్తలు దానికి ఓ పేరు పెట్టి ప్రచారం కల్పించడంతో ప్రశాంత్ కిషోర్ దృష్టి అటు పడింది. అదే విషయాన్ని జగన్ చెవిలో వేయడంతో ఆయనకి తెగ నచ్చిందట. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఆ ప్లాన్ ని వైసీపీ దృక్కోణంలో అమలు చేసేందుకు రెడీ అవుతున్నారు.
పైకి ఒబామా పేరు చెబుతున్నప్పటికీ ఈ ప్లాన్ అమలు చేయడంలో అసలు ఉద్దేశం వేరే వుంది. ముద్రగడని ఎంతగా ఫోకస్ చేసినా కాపు రిజర్వేషన్ ఉద్యమం వల్ల వైసీపీ కి ఏ మాత్రం అదనపు ప్రయోజనం లేదు. పైగా కాపులు వెంట నిలుస్తున్న పవన్ కళ్యాణ్ కూడా వైసీపీ కి పూర్తి వ్యతిరేకం అని తేలిపోయింది. చంద్రబాబు సర్కార్ కాపుల రిజర్వేషన్ కి అనుకూల నిర్ణయం తీసుకోవడం, పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి వైసీపీ మీద పరోక్ష విమర్శలు చేయడంతో ఇక ప్రత్యామ్న్యాయం చూసుకోవాలని జగన్ డిసైడ్ అయ్యారు. కాపులకి పార్టీలో ప్రాధాన్యం తగ్గించి బీసీ వాణి పెంచాలని జగన్ నిర్ణయించడమే కాకుండా తన పాదయాత్రలో దాన్ని అమలు చేస్తున్నారు. ప్రతి చోట బీసీ సమస్యలపై గళం ఎత్తుతున్న జగన్ అసలు ఒక్క చోట కూడా కాపు రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావించడం లేదు. అయితే కాలం గడిచేకొద్దీ ఈ విషయాన్ని గమనించి పార్టీలో మిగిలిన కాపులు కూడా దూరం అవుతారని భావించి ఒబామా పేరుతో వాళ్ళ కళ్ళకి గంతలు కట్టాలని చూస్తున్నారు. అయితే ఇప్పటికే వైసీపీలో కాపు నేతలు కొందరు ఈ విషయాన్ని అర్ధం చేసుకుని తగిన అవకాశం చూసుకుని జంప్ చేయడానికి రెడీ గా వున్నారు.