Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజకీయాల్లో పార్ట్ టైమ్ పొలిటీషియన్ గానే తాను సీఎం కంటే ఎక్కువని పవన్ కళ్యాణ్ అనుకోవడం ఆయన సన్నిహితులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. రాజకీయ ప్రయోజనాల కోసం వివిధ పార్టీలు ఆయనకు అవసరానికి మించిన ప్రాధాన్యత ఇస్తున్నంత మాత్రాన.. వాపును బలుపు అనుకుంటే అభిమానులు దూరమవుతారనే వాదన బయల్దేరింది. దీనికి తోడు వివిధ సందర్భాల్లో పవన్ ఓవరాక్షన్ కూడా ఇందుకు తోడవుతోంది.
మిగతా విషయాలు పక్కనపెడితే.. ఆగస్టు 15 రోజు పవన్ చేసిన కామెడీ షో చూసి జనం దడుసుకున్నారు. జెండాకు మొక్కుతారు. జెండా పాతిన నేలకు మొక్కుతారు. కానీ జెండా దిమ్మకు మొక్కిన పవన్ కొత్త రికార్డు సృష్టించారు. అచ్చు సినిమాల్లో మాదిరి పవన్ చేసిన ఓవరాక్షన్ కు సోషల్ మీడియాలో సెటైర్లు వచ్చిపడుతున్నాయి. పైగా ఆగస్టు 15 ముందు రోజే స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పడం కూడా ఇబ్బందికరంగా మారింది.
మన ఇండిపెండెన్స్ డే ముందు రోజు పాకిస్థాన్ స్వతంత్ర దినోత్సవం. అలాంటప్పుడు ఆరోజు పవన్ ఫేస్ బుక్ పోస్టింగులు పెట్టడం వివాదాస్పదమైంది. పవన్ ఇండియా ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారా.. లేదంటే పాక్ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారా అని అందరికీ డౌటొచ్చింది. పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా పోజులు మానేసి పని చేస్తే బాగుంటుందని జనం అనుకుంటున్నారు.
మరిన్ని వార్తలు: