Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ట్విట్టర్ మాధ్యమంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, కొన్ని మీడియా సంస్థల మీద తీవ్ర విమర్శలు చేసిన పవన్.. తాజాగా మరోసారి అదేస్థాయిలో విమర్శలు గుప్పించారు. రేపు ఉదయం 10 గంటలకు మరిన్ని విషయాలు వెల్లడిస్తానని.. అందరి బాగోతాలు బయటపెడతానని చెప్పిన పవర్ స్టార్.. అన్నంత పనీ చేశారు. ట్విట్టర్ వేదికగా ప్రత్యర్థులకు ఝలక్ ఇచ్చారు. తనను బ్లాక్ మెయిలర్ అని ఓ ముఖ్యమంత్రి అన్నారని.. ఓ మంత్రి మరొకరితో చెప్పారని.. ఆ మంత్రి ఎవరో తెలుసుకోవాలని ఉందా అంటూ నెటిజన్లను ప్రశ్నించారు.
Stay tuned to “బట్టలు విప్పి మాట్లాడుకుందాం” program nunchi – Pawan Kalyan with cameraman Twitter.
— Pawan Kalyan (@PawanKalyan) April 21, 2018
ఒక రాష్ట్ర కాబినెట్ రాంక్ మంత్రి స్వయానా యీ “ అజ్ఞ్యాతవాసి” ని “ వాడో blackmailer అని స్వయానా ముఖ్యమంత్రి గారు అన్నారని అని “ఒకరి”తో అన్నారు.
ఆ మంత్రి ఎవరు, ఆ ముఖ్యమంత్రి ఎవరు, “ఒకరు” ఎవరు… తెలుసుకోవాలనివుందా !!!— Pawan Kalyan (@PawanKalyan) April 21, 2018
నాకు ఇష్టమైన స్లోగన్ “ ఫ్యాక్షనిస్టుల ఆస్తలుని జాతీయం చెయ్యాలి” అసలు యీ స్లోగన్ వెనకాల కథ కి యీ స్లోగన్ కి సంబంధం ఏంటి?
— Pawan Kalyan (@PawanKalyan) April 21, 2018
Stay tuned!! Live from Hyd! నిజాలిని నిగ్గు తేలుద్దాం”ప్రోగ్రాం నుంచి మీ
Pawan Kalyan— Pawan Kalyan (@PawanKalyan) April 21, 2018
స్టే ట్యూన్డ్ లైవ్ ఫ్రమ్ హైదరాబాద్.. నిజాలు నిగ్గు తేలుద్దాం ప్రోగ్రామ్ నుంచి మీ పవన్ కళ్యాణ్ అని వ్యంగ్యంగా తనదయిన స్టైల్లో ట్వీట్స్ చేశారు పవన్ కళ్యాణ్. నాకిష్టమైన స్లోగన్ ఫ్యాక్షనిస్టుల ఆస్తులను జాతీయం చేయడం.. అసలీ స్లోగన్ వెనకాల కథకీ యీ స్లోగన్ కి సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఇక బట్టలు విప్పి మాట్లాడుకుందాం ప్రోగ్రాం మొదలైంది అని స్పష్టం చేస్తూ ట్విట్ చేశారు. నిజమైన అజ్ఞాతవాసి ఎవరో మీకు తెలుసా అని వరుస ట్వీట్లతో ప్రశ్నించడం మొదలుపెట్టారు. పవర్ స్టార్ ట్విట్ల వల్ల కలకలం మొదలైపోయింది. ఆ చానల్ టీవీ9 అని అందరికీ ఈపాటికి అర్ధం అయిపొయింది అయితే ఆ స్లోగన్ వెనకున్న కధ ఎప్పుడు బయటకి వస్తుందా అని అంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.