పవన్ కల్యాణ్ ఒక క్రేజీ సినిమా హీరో అనే ఇమేజి చట్రం నుంచి, ఒక రాజకీయ నాయకుడిగా, ప్రజల నాయకుడిగా మారే క్రమంలో ఎంతటి గందరగోళానికి లోనవుతున్నాడో.. తనుక వ్యవహారాల మీద అవగాహన లేకపోతున్న కారణంగా ఎంత కన్ఫూజన్ కు గురవుతున్నారో ఆ కన్ఫ్యూజన్ లో అర్థం పర్థం లేకుండా ఎలా మాట్లాడుతున్నారో ఆయనను ఈ మధ్య కాలంలో బాగా ఫాలో అవుతున్న వారికీ పెద్దగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఫ్రాన్క్లిన్ టెంపుల్ టన్ మొదలుకుని అసెంబ్లీకి ఎంపీలను పంపుతానని చెప్పడం దాకా ఆయన దాదాపు చేస్తున్న వ్యాఖ్యలన్నీ దాదాపు అవగాహన లేనివే అని ప్రూవ్ చేసుకుంటున్నాడు. తాజాగా ఇప్పుడు రాజమండ్రి బ్రిడ్జిపై ఈ నెల 9న తల పెట్టిన కవాతును 15న ధవళేశ్వరం బ్యారేజీపై చేయనున్నట్లు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పిఎసి) కన్వీనర్ మాదాసు గంగాధరం ప్రకటించారు. కవాతు ప్రాంతం, తేదీని మార్చాలని తూర్పు గోదావరి జిల్లా నేతలతో నిర్వహించిన సమావేశంలో పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.
కవాతు తేదీని మార్చాలని జిల్లా నేతలు చేసిన సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కవాతుకు లక్షలాదిగా అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉన్నందున రాజమండ్రి పాత బ్రిడ్జికి బదులుగా ధవళేశ్వరం బ్యారేజీకి మార్చాలని నిర్ణయించామన్నారు. అయితే అసలు కవాతు నిర్వహణ అంటే పూర్తిగా అవగాహన లేని జనసేనాదిపతి మరో మారు నవ్వుల పాలు అవుతున్నారు. ఎందుకంటే సాధారణంగా ఇంటర్ స్థాయి వరకూ చదువుకున్న పిల్లలకే ఈ కవాతు నిర్వహణ మీద కాస్తో కూస్తో అవగాహన ఉంటుంది. కానీ తాను ఎన్నో లక్షల పుస్తకాలు చదివానని చెప్పుకునే పవన్ కు ఈ మాత్రం అవగాహనా లేకపోవడం శోచనీయం. ఎందుకంటే సాదారణంగా సైనికులే వంతెనలు వచ్చినపుడు కవాతు ఆపేసి నడుస్తారు ఎందుకంటే కవాతు చేస్తున్నప్పుడు వీరి మూమెంట్ ఫ్రీక్వెన్సీ, అలాగే బ్రిడ్జ్ ఫ్రీక్వెన్సీ ఒక్కటే అయి ఆ బ్రిడ్జ్ కూలిపోయే అవకాశం ఉంటుంది. ఇది జగన్ పాదయాత్ర విషయంలో ఒక సరి నిరూపణ అయింది. గుంటూరు నుండి కృష్ణా లో అడుగుపెడుతున్న జగన్ వారధి మీద నుండి పాదయాత్రగా జిల్లాలో ప్రవేశించారు. ఆ సమయంలో ఆయన వెంట ఉన్న జనం నడిస్తేనే ఆ బ్రిడ్జ్ పూనకం వచ్చినట్టు ఊగింది. ఆ దెబ్బకు వెంటనే జగన్ పాదయత్ర ఆపేసి ఒక్క రెండు నిముషాలు పాటు ఎవరూ కదలోద్దని మైక్ లలో చెప్పించారు. అలా చేయకుండా ఉంటె ఎలా ఉండేదో పరిస్థితి ! ఈ పరిణామం చూసాక జగన్ రాజమండ్రి బ్రిడ్జ్ మీద వెళ్తానంటే అనుమతి నిరాకరించారు పోలీసులు. అయితే ఏమి జరగకుండా చూసుకునే బాధ్యత తమదేనని వైసీపీ నేతలు రాసి ఇవ్వడంతో అప్పుడు పోలీసులు పాదయాత్రకు అనుమతించారు. ఇప్పుడు పవన్ ఇవన్నీ తెలిసి కూడా ఈ కవాతులకి పిలుపు నిస్తున్నాడంటే ఒకటి విధ్వంసం సృష్టించడానికి అయినా అవ్వాలి, లేదా ప్రభుత్వం మీద వివక్ష పూరిత ముద్ర వేయడానికి అయినా అయుండాలి.