Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇటీవలి కాలంలో తరచుగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోమారు వైసీపీ అధినేత పై తన దైన శైలిలో విమర్శించారు. జగన్ పాదయాత్రకు జనం రావడంలో విశేషమేమీ లేదని, టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సభ పెట్టినా జనం విరగబడి వస్తారని జేసీ… ఎద్దేవా చేశారు. జగన్ పాదయాత్రను ఆయన వృథా ప్రయాసగా అభివర్ణించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసినప్పటి పరిస్థితి వేరని, ఇప్పటి పరిస్థితులు వేరని విశ్లేషించారు. జగన్ వల్ల రెడ్డి కులస్థులకు విలువ లేకుండా పోయిందని జేసీ ఆరోపించారు.
రెడ్లంతా జగన్ వెంట ఉండడంతో ఇతర కులాలకు చెందిన వారు రెడ్లను గౌరవించడం మానేశారని, రెడ్ల తోకలను కరణం బలరాం వంటి వారు కోసేశారని జేసీ అభిప్రాయపడ్డారు. వైఎస్ గురించి చెప్పుకునే రోజులు పోయాయన్నారు. పాదయాత్రకు జనం వచ్చినంత మాత్రాన తనకు ప్రజాదారణ ఉందని ఎవరూ భావించకూడదన్నారు. గతంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ సభలకూ జనం వచ్చారని, రోజా పెట్టినా వస్తారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. జగన్ రాజకీయాలు వదిలేసి మంచి పారిశ్రామిక వేత్తగా ఎదగాలని జేసీ సూచించారు. తనకు ఇకపై రాజకీయాలు అనవసరమని, 2019లో రాజకీయాల నుంచి రిటైర్ అవుతానని జేసీ చెప్పారు.