టీవీ సీరియళ్ళ మీద జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన కామెంట్లు…!

JC Prabhakar Reddy Commented On TV Serials

టీవీ సీరియల్స్ అనగానే చాలామంది మగాళ్లకు కోపం వస్తుంది. తాము ఇంచికొచ్చినా పట్టించుకోకుండా ఆడవాళ్లు టీవీలకు అతుక్కుపోతారు కాబట్టి ఆ కోపం సహజం. అయితే ఈ టీవీ సీరియల్స్ వ్యవహారంపై తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. వీటి కారణంగా ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదని అన్నారు. అసలు వీటివల్ల ప్రయోజనం ఏముంది? అని మహిళలను డైరెక్టుగా ప్రశ్నించారు. తాడిపత్రిలోని జేసీ నాగిరెడ్డి షాదీఖానాలో జరిగిన దుల్హన్ పథకం మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

jc-prabhaker
ఈ సందర్భంగా సదస్సుకు హాజరైన మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘ఇప్పుడు వస్తున్న టీవీ సీరియల్స్ లో అసలు నీతి ఉందా? కేవలం ధనార్జనే ధ్యేయంగా సీరియల్స్ తీస్తున్నారు. వీటివల్ల జనాలకు ఎలాంటి ప్రయోజనం లేదు. కేవలం కుటుంబాల్లో అసూయ, ఈర్ష్య, ద్వేషాలు, పగ, ప్రతీకారాలు మాత్రం ఇవి రెచ్చగొడుతున్నాయి. మానవ సంబంధాలు, కుటుంబ విలువలు తగ్గిపోయేలా సీరియల్స్ తీస్తున్నారు’ అని ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు.

tv-serials