Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నెలల కొద్దీ కడుపు మాడ్చుకుని , శరీరాన్ని కసరత్తులతో కష్టపెట్టినా సిక్స్ ప్యాక్ రావడం అనుమానమే. అలాంటిది రోజు ఓ 5 నిమిషాలు కష్టపడితే సిక్స్ ప్యాక్ వస్తుందని కొత్తగా వెండితెర మీద వెలిగిపోడానికి వస్తున్న జాన్వీ కపూర్ చెబుతోంది. జాన్వీ అంటే ఎవరో కాదు . అలనాటి అందాల తార శ్రీదేవి ముద్దుల పెద్ద కూతురు. సైరాట్ అనే మరాఠీ మూవీ రీమేక్ తో తొలిసారి బాలీవుడ్ కి పరిచయం అవుతున్న ఈ అమ్మడు ఆ సినిమా కోసం జిమ్ లో బాగా కష్టపడుతోంది. అదే టైం లో సరదాగా ట్రైనర్ తో కలిసి సిక్స్ ప్యాక్ కోసం చేయాల్సిన కసరత్తులు ఏమిటో అమ్మడు వివరిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.