Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
క్రికెట్ అభిమానుల పండగ మళ్లీ ప్రారంభం కాబోతుంది. ఐపీఎల్ 11వ సీజన్ ప్రారంభంకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారీ ఎత్తున ఇండియాలో ఆధరణ ఉన్న ఐపీఎల్ ప్రసార హక్కులను తాజాగా స్టార్ స్పోర్ట్స్ దక్కించుకుంది. స్టార్ ఛానెల్ వారు ఐపీఎల్ ప్రసార హక్కులు దక్కించుకున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున పబ్లిసిటీ కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నారు. అందుకోసం పలువురు బాలీవుడ్ స్టార్స్‌తో పాటు ఆయా భాషల్లో స్టార్స్‌ను బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపిక చేసుకోబోతున్నారు.
తెలుగు నుండి యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను ఐపీఎల్ బ్రాండ్ అంబాసిడర్‌గా స్టార్ వారు ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. స్టార్ ఛానల్ గత సంవత్సరం ఎన్టీఆర్‌తో బిగ్‌బాస్ కోసం ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెల్సిందే. ఆ ఒప్పందంతో స్టార్ ఛానల్‌కు మంచి లాభం చేకూరింది.
అందుకే స్టార్ వారు మరోసారి ఎన్టీఆర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది. మాటీవీలో ఐపీఎల్ ప్రసారంను చేయాలని భావిస్తున్న స్టార్ ఛానెల్ పెద్ద ఎత్తున ఎన్టీఆర్‌తో యాడ్స్‌ను చిత్రీకరించడంతో పాటు, ముఖ్య నగరాలు మరియు పట్టణాల్లో హోర్డింగ్స్‌ను ఏర్పాటు చేయాలనే ప్లాన్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఐపీఎల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించబోతున్న మొదటి తెలుగు హీరోగా ఎన్టీఆర్ రికార్డుల్లోకి ఎక్కబోతున్నాడు.