ఈ కుర్రాడు తగ్గేదే లేదంటున్నాడు

Kajal Agarwal to Act movie with Bellamkonda Srinivas

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ మొదటి చిత్రం ‘అల్లుడు శీను’ నుండి తాజాగా నటిస్తున్న సాక్ష్యం చిత్రం వరకు దాదాపు అన్ని చిత్రాల్లో కూడా స్టార్‌ హీరోయిన్స్‌తో రొమాన్స్‌ చేస్తూ వస్తున్నాడు. సమంత, తమన్నా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, పూజా హెగ్డే ఇలా స్టార్‌ హీరోయిన్స్‌తో నటిస్తూ, మంచి క్రేజ్‌ను దక్కించుకున్న ఈ కుర్ర హీరో ఈసారి ఏకంగా కాజల్‌తో రొమాన్స్‌కు సిద్దం అవుతున్నాడు. ‘సాక్ష్యం’ రిలీజ్‌కు ముందే మరో కొత్త సినిమాను శ్రీనివాస్‌ కమిట్‌ అయ్యాడు. పలు చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేసిన శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఒక చిత్రం తాజాగా ప్రారంభం అయ్యింది. ఆ సినిమాలో హీరోయిన్‌గా కాజల్‌ను ఎంపిక చేయడం జరిగింది.

సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌గా కొనసాగుతూ వస్తున్న కాజల్‌కు గత కొంత కాలంగా స్టార్స్‌కు జోడీగా నటించే అవకాశం దక్కడం లేదు. మెగాస్టార్‌ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెం.150లో నటించింది. ప్రస్తుతం కళ్యాణ్‌ రామ్‌కు జోడీగా ఒక చిత్రంలో నటిస్తుంది. స్టార్‌ హీరోలతో మాత్రమే నటిస్తాను అంటూ భీష్మించుకు కూర్చున్న కాజల్‌ భారీ పారితోషికం ఆఫర్‌ చేయడంతో బెల్లంకొండ శ్రీనివాస్‌కు జోడీగా నటించేందుకు ఓకే చెప్పింది. ప్రస్తుతం కాజల్‌కు ఉన్న స్థాయి కంటే డబుల్‌ పారితోషికంను ఆఫర్‌ చేశారని, అందుకే ఆ చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పిందని సినీ వర్గాల వారు అంటున్నారు. కాజల్‌ హీరోయిన్‌ అవ్వడంతో ఖచ్చితంగా ఈ చిత్రానికి భారీ క్రేజ్‌ ఉంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. మొత్తానికి వరుసగా స్టార్‌ హీరోయిన్స్‌తో రొమాన్స్‌ చేస్తూ అందరి దృష్టిని ఈ కుర్ర హీరో ఆకర్షిస్తున్నాడు. ఈయన తర్వాత ఏ హీరోయిన్‌తో రొమాన్స్‌ చేస్తాడో చూడాలి.