పుష్కర కాలంగా తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హీరోయిన్గా కొనసాగుతూ వస్తున్న కాజల్ ప్రస్తుతం తన స్టైల్‌ను మార్చుకుంది. తాజాగా ఈ అమ్మడు స్టార్ హీరోలతో కాకుండా యంగ్ హీరోలతో నటిస్తోంది. గత రెండు సంవత్సరాలుగా ఈ అమ్మడికి స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు తక్కువగా వస్తున్నాయి. ఈ సమయంలోనే ఈమె రానా, కళ్యాణ్ రామ్ వంటి చిన్న హీరోలతో నటిస్తూ వస్తుంది. చిన్న హీరోలతో నటించినప్పటికి పెద్ద పారితోషికాలు తీసుకుంటుంది. తాజాగా ఈమె బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్గా నటించేందుకు సిద్దం అయ్యింది. ఇటీవలే ఈ చిత్రం పట్టాలెక్కింది. బెల్లంకొండ శ్రీనివాస్‌తో నటించేందుకు ఈ అమ్మడు ఏకంగా రెండు కోట్ల పారితోషికం అందుకుంటుంది. తాజాగా ఈమె మరో యువ హీరోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ హీరోగా ఓనమాలు దర్శకుడు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కబోతుంది. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న క్రాంతి మాధవ్ ఒక మంచి కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కేఎస్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. తాజాగా ఈ చిత్రం కోసం కాజల్‌ను ఎంపిక చేయడం జరిగింది. భారీ పారితోషికం ఇచ్చి మరీ ఈ చిత్రంకు ఆమెను ఓకే చేసినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ మరియు కాజల్‌ల పాత్రలు చాలా కొత్తగా ఉంటాయని సినీ వర్గాల వారు అంటున్నారు. క్రాంతి మాధవ్ హీరోయిన్స్‌కు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాడు. అందుకే ఈ చిత్రంలో కాజల్ పాత్ర ఎలా ఉంటుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.