Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ వరుసగా చిత్రాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఫలితంతో సంబంధం లేకుండా కళ్యాణ్ రామ్ చిత్రాల సంఖ్య పెంచుకుంటూనే ఉన్నాడు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ రెండు చిత్రాలు చేస్తున్నాడు. అందులో మొదటిది ‘ఎమ్మెల్యే’ కాగా రెండవది ‘నానువ్వే’. ఈ రెండు చిత్రాల్లో ‘ఎమ్మెల్యే’ మొదట ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. కాజల్ హీరోయిన్గా నటించడంతో సినిమా ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ చిత్రంకు సంబంధించిన స్టోరీ లైన్‌ను యూనిట్ సభ్యులు లీక్ చేయడం జరిగింది. లీక్ అయిన స్టోరీ లైన్ ప్రకారం కళ్యాణ్ రామ్ ఒక సాదారణ యువకుడు. మద్య తరగతి కుటుంబంకు చెందిన వ్యక్తి కార్పోరేట్ సంస్థలతో ఢీ కొట్టాల్సి వస్తుంది, ఆ పరిస్థితుల్లో హీరో ఏం చేశాడు అనేదే కథ.
ఇలాంటి కథలు గతంలో తెలుగు స్క్రీన్‌పై చాలానే వచ్చాయి. అయితే స్క్రీన్‌ప్లే కొత్తగా చూపిస్తే పర్వాలేదు. కాని రొటీన్ కథను రొటీన్ స్క్రీన్‌ప్లేతో చూపిస్తే మాత్రం ప్రేక్షకులు ఆధరించరు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొత్త దర్శకుడు అవ్వడంతో పాటు, కళ్యాణ్ రామ్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లుగా కొత్త స్క్రీన్‌ప్లేతో సినిమాను చేశాడని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అయితే ఆ విషయంలో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది. స్క్రీన్‌ప్లే రొటీన్‌గా ఉంటే ఖచ్చితంగా కళ్యాణ్ రామ్‌కు మరో అపజయం తప్పదని సినీ వర్గాల వారు అంటున్నారు. కళ్యాణ్ రామ్ ‘ఎమ్మెల్యే’పై నందమూరి ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. మరి వారి ఆశు నిలిచేనా లేదా అడియాశు అయ్యేనా అనేది చూడాలి.