Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పవన్‌పై గత కొన్ని రోజులుగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న కత్తి మహేష్‌పై తాజాగా కోడి గుడ్లతో దాడి చేసిన విషయం తెల్సిందే. టీవీ9 స్టూడియోకు దగ్గర్లో కత్తి మహేష్‌పై ఇద్దరు యువకులు కోడిగుడ్లతో దాడి చేయడం జరిగింది. వారు తాజాగా టీవీ9 స్టూడియోకు వెళ్లి తామే కత్తి మహేష్‌పై కోడిగుడ్లతో కొట్టినట్లుగా ఒప్పుకున్నారు. పవన్‌ను అన్నేసి మాటలు అంటూ ఉంటే తట్టుకోలేక పోతున్నామని, గతంలో పలు సార్లు కత్తి మహేష్‌ను కలిసి బతిమిలాడి వివాదంకు ఫుల్‌స్టాప్ పెట్టాలని ప్రయత్నించామని, కాని ఆయన మాకు సమయం ఇవ్వలేదు, అసలు మాతో మాట్లాడేందుకు కూడా నిరాకరించాడు. ఆ కోపంతోనే ఆయనపై నిరసనగా కోడిగుడ్లు విసిరినట్లుగా చెప్పుకొచ్చారు.
కత్తి మహేష్ మాటల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ రోజు రోజుకు సీరియస్ అవుతున్నారు. వారి నుండి కత్తి మహేష్‌కు మరింత ప్రమాదం ఉందని కొందరు విశ్లేషిస్తున్నారు. కత్తి మహేష్ స్వయంగా తన మాటలతో వారిని రెచ్చగొడుతున్నాడు. నిన్న టీవీ9లో పవన్ ఎవడు అంటూ గట్టి స్వరంతో ప్రశ్నించడంతో దాడి జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ వివాదం మరింతగా ముదిరితే కత్తి మహేష్‌కు ఇబ్బందులు తప్పవు అంటూ కొందరు అంటున్నారు. ప్రస్తుతం కత్తి మహేష్‌కు ప్రైవేట్ సెక్యూరిటీగా కొందరు ఉన్నారు. వారి సంఖ్యను కత్తి మరింతగా పెంచుకునే అవకాశం ఉంది. మొత్తానికి కత్తి మహేష్, పవన్ ఫ్యాన్స్ మద్య యుద్దం మరింతగా ముదురుతుంది.