పరువు నష్టం దావాకు మహేష్‌ రెడీ

Kathi Mahesh Defamation suit on Artist Sunitha

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కాస్టింగ్‌ కౌచ్‌ వ్యవహారంలో సునీత అనే జూనియర్‌ ఆర్టిస్టు కత్తి మహేష్‌పై సంచల వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. కేవలం అయిదు వందల రూపాయలు ఇచ్చి తనను అనుభవించాడు అంటూ ఆమె ప్రముఖ వార్త ఛానెల్‌లో చెప్పడం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా ఉంది. కత్తి మహేష్‌ ఎంతో మంది అమ్మాయిలను వాడుకున్నాడని, సినిమాల్లో ఆఫర్లు ఇస్తాను అని, ఇప్పిస్తాను అంటూ అమ్మాయిలను మోసం చేశాడు అంటూ కత్తి మహేష్‌పై సునీత తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన నేపథ్యంలో కత్తి మహేష్‌ స్పందించాడు. సునిత చేసిన ఆరోపణలు నిజం కావని, ఆమెపై 50 లక్షలకు పరువు నష్టం దావా వేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా కత్తి మహేష్‌ ప్రకటించాడు.

కత్తి మహేష్‌ ఇంకా మాట్లాడుతూ… తాను గత కొంత కాలంగా మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఉన్నందున వారు కక్ష కట్టి తనపైకి సునీతను వదిలినట్లుగా తెలుస్తుంది. ఆమె ఇంటర్వ్యూలో సైరా చిత్రం షూటింగ్‌ నుండి వచ్చినట్లుగా చెప్పుకొచ్చింది. అంటే ఆమె కొణిదెల ప్రొడక్షన్స్‌ ఆఫీస్‌ నుండి వచ్చి ఉంటుందని అనిపిస్తుందని కత్తి చెప్పుకొచ్చాడు. తనను ఈ రకంగా దెబ్బ కొట్టేందుకు మెగా కుటుంబీకులు ప్రయత్నాలు చేస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లో తన ఆందోళన ఆపేది లేదు అంటూ పరువు నష్టం దావా గురించి కత్తి మహేష్‌ చెప్పుకొచ్చాడు. తనపై సునీత చేసిన ఆరోపణల వల్ల తన పరువుకు నష్టం జరిగిందని, అందుకే ఆమెపై, ఆమె వెనుక ఉన్న వారిపై పరువు నష్టం దావా వేస్తున్నట్లుగా కత్తి చెప్పుకొచ్చాడు.