Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పవన్ కళ్యాణ్‌ను ఇప్పటి వరకు ఎవరు విమర్శించని రీతిలో కత్తి మహేష్ విమర్శిస్తున్నాడు. పవన్‌ను చిన్న మాట అనాలి అంటేనే సినీ వర్గాల వారు కాస్త వెనుక ముందు ఆడతారు. ఆయన గురించి చిన్న విమర్శ చేస్తే ఫ్యాన్స్ ఏ స్థాయిలో విరుచుకు పడతారో అనే భయం ఎక్కువ మందిలో ఉంటుంది. అలాంటిది కత్తి మహేష్ ప్రతి రోజు కూడా పవన్‌ను టార్గెట్ చేస్తూ ట్వీట్స్ లేదా ఇంటర్వ్యూల్లో విమర్శలు చేస్తూ వస్తున్నాడు. సంక్రాంతి ముందు కోన వెంకట్ ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యాడు. కత్తి మహేష్ నాలుగు రోజుల పాటు కోన వెంకట్ సూచన మేరకు సైలెంట్ అయ్యాడు. ఈనెల 16 తర్వాత మళ్లీ షురూ అయ్యింది.
సంక్రాంతి తర్వాత కత్తి మహేష్‌కు, పవన్‌తో రాజీ కుదిర్చే విషయమై కోన హామీ ఇచ్చాడు. కాని కోన హామీ ఇచ్చినట్లుగా సంక్రాంతి తర్వాత పవన్‌తో ఎలాంటి ప్రకటన చేయించలేదు. దాంతో ఆగ్రహించిన కత్తి మహేష్ మళ్లీ నిన్నటి నుండి రెచ్చి పోతూనే ఉన్నాడు. కోన వెంకట్ ఈ విషయానికి ఒక స్వస్థి పలికే అవకాశం ఉందని అంతా భావించారు. కాని షాకింగ్‌గా కత్తి మహేష్‌తో కోన వెంకట్ చర్చలు విఫలం అయ్యాయి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ దిగి వచ్చి జరిగినదానికి సారీ చెప్పి, అభిమానులను హద్దుల్లో ఉంచుకోవాల్సిందే అంటూ కత్తి మహేష్ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోన వెంకట్ కూడా ఏమీ చేయలేక చేతులెత్తేశాడు.