Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎందరో అమరవీరులయ్యారు. వారందరి ప్రాణత్యాగం మూలంగానే ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నెరవేరింది. తెలంగాణ కల సాకారం చేసిన అమరుల త్యాగాలకు శాశ్వతగుర్తింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరాన అమరవీరుల సంస్మరణ చిహ్నం ఏర్పాటుచేస్తోంది. మార్టిర్స్ మెమోరియల్ డిజైన్ కు ముఖ్యమంత్రి కార్యాలయం ఆమోదం తెలిపింది. మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అమరులైన వందలాదిమంది త్యాగాలను శాశ్వతీకరించే మార్టిర్స్ మెమోరియల్ డిజైన్ కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ఆమోదం తెలిపిందని, హైదరాబాద్ హుస్సేన్ సాగర్ వద్ద ఇది ఏర్పాటు కానుందని కేటీఆర్ ట్వీట్ చేశారు. దీంతోపాటు డిజైన్ ఫొటోను పోస్ట్ చేశారు. సిల్వర్ రంగులో పెద్ద సైజు ప్రమిద, అందులోనుంచి బంగారు వర్ణంలో ఎగసిపడుతున్న జ్యోతితో ఈ డిజైన్ ఆకట్టుకుంటోంది.