Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
చూస్తుంటే తెలంగాణ మంత్రి హరీష్ రావుని అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు కూడా లైట్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. మొదట్లో హరీష్ తలుచుకుంటే ప్రభుత్వం కూలిపోతుందని ప్రతిపక్షాలు జోస్యాలు చెప్పాయి. కానీ సీన్ రివర్స్ అవుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు కూడా ఆయన్ను సీన్ లోంచి తీసేశాయి.
ఇప్పటికే కేసీఆర్ చాలా కార్యక్రమాలకు ఆయన అటెండ్ కాకుండా కేటీఆర్ ను పంపిస్తున్నారు. కేటీఆర్ అనధికారిక సీఎంగా కంటిన్యూ అవుతున్నారు. అధికారులు కూడా ఆయనే సీఎం తర్వాత సీఎం అని ఫిక్సైపోయారు. కానీ హరీష్ మాత్రం రోజురోజుకీ వెనకబడుతున్నారు. ఆయన తన శాఖల పనేదో చూసుకుంటూ.. ఇతర విషయాలు మాట్లాడటం లేదు.
ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా విమర్శల్లో హరీష్ ను పక్కన పెట్టేస్తున్నారు. కేవలం కేసీఆర్, కేటీఆర్ నే టార్గెట్ చేస్తున్నారు. హరీష్ గురించి మాట్లాడటమే వేస్ట్ అన్నట్లుగా పొలిటికల్ సీన్ మారిపోయింది. ఓఢలు బండ్లు కావడమంటే ఇదేనేమో.
మరిన్ని వార్తలు: