Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దేశంలో ప్రతి వర్గంలోనూ ఎవరికి వారే శత్రువులుగా మారిపోతున్నారు. ముఖ్యంగా కలిసికట్టుగా ఉండాల్సిన రైతులు కూడా స్వార్థఫరులుగా మారిపోతున్నారు. అందుకే చాలా మంది రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కొంతమంది మాత్రం ఎకరాలు ఎకరాలు కూడబెట్టుకుంటున్నారు.
రైతుకు రైతే శత్రువని కేసీఆర్ చెప్పడం కలకలం రేపుతోంది. డిమాండ్ ఉండే పంటల్ని మితంగా పండించాలని, అంతే కానీ వేలం వెర్రిలా పండిస్తే ఎవరికీ రేటు రాదని ఆయన కుండబద్దలు కొట్టారు. అందరికీ సంఘాలున్నా.. రైతులు ఇంతవరకూ సమాఖ్యలను ఏర్పాటుచేసుకోలేదన్నారు.
రైతుల పొట్టకొడుతున్న దళారులకు కూడా అసోసియేషన్లు ఉన్నాయని, కానీ రైతులు మాత్రం ఎవరికి వారే అన్నట్లుగా ఉంటున్నారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు తమ పని తాము చేసుకుంటూ.. సమాజంలో మార్పుల్ని అవగాహన చేసుకోవడం లేదని, ఇదే అదనుగా రైతుల అమాయకత్వాన్ని దళారులు క్యాష్ చేసుకుంటున్నారని చెప్పేశారు కేసీఆర్.
మరిన్ని వార్తలు:
సమైక్య బాటలో తెలంగాణ పోలీసులు
దిలీప్ కు దెబ్బ మీద దెబ్బ