రోజా కి పోటీగా హేమ… జగన్ ప్లాన్ ?

Jagan Plans to decrease roja voice actress hema joins in YSRCP

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా కి కష్టకాలం ఇప్పట్లో తొలిగిపోయేట్టు లేదు. ఒక దాని తర్వాత ఒక్కో సమస్య ఆమెని వెంటాడుతూనే వున్నాయి. వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వచ్చి ఆమెని అందరి ముందే నోటి దూకుడు తగ్గించుకోమని సలహా ఇచ్చిన అవమాన భారం దిగమింగుకోకముందే ఇంకో వార్త ఆమెకి షాక్ కలిగిస్తోంది. వైసీపీ లో నోటిదూకుడు నేతలకి కళ్లెం వేయకపోతే ఇంకా నష్టం జరుగుతుందని ప్రశాంత్ కిషోర్ హెచ్చరికలకు అనుగుణంగా జగన్ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. కాపు రిజర్వేషన్ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తున్న సినీ నటి హేమ కి పార్టీలో పెద్ద పీట వేయాలని భావిస్తున్నారట. రోజాని మీడియా ముందుకు పెద్దగా రాకుండా చూడాలంటే, ఆమెని నియోజకవర్గానికే పరిమితం చేయాలంటే ఏదైనా ప్రత్యామ్న్యాయం చూసుకోవాలని డిసైడ్ అయ్యారంట. అదే సమయంలో అటు హేమ సైతం వైసీపీ లో చేరడానికి ఆసక్తి చూపడంతో ఆమెని రోజాకి బదులుగా ఫోకస్ చేయడానికి వైసీపీ లో రంగం సిద్ధం అయ్యిందట.

హేమ వైసీపీ లో చేరిన వెంటనే ఆమెకి పార్టీ పదవితో పాటు తూర్పు గోదావరి జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి టికెట్ ఇవ్వడానికి జగన్ సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాపు ఉద్యమం లో తన వాణి వినిపిస్తున్న హేమ వల్ల పార్టీకి ప్రయోజనం చేకూరుతుందని జగన్ భావిస్తున్నారట. ఇదే జరిగితే వైసీపీ లో రోజా స్పీడ్ కి బ్రేక్ పడినట్టే.

మరిన్ని వార్తలు:

సమైక్య బాటలో తెలంగాణ పోలీసులు

దిలీప్ కు దెబ్బ మీద దెబ్బ

ఐటీలో ఈ ఉద్యోగాలు ఇక హుష్ కాకి.