Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరాం ఇప్పుడు ఎవ్వరికీ కానివారయ్యారు. ఉద్యమాలతో ఎవ్వరి పక్షం వహించకుండా తటస్థ నాయకుడిగా పేరు తెచ్చుకున్న కోదండరాం.. ఇప్పుడు మాత్రం ఉద్యమాలు చేయడానికి ఆపసోపాలు పడుతున్నారు. కేసీఆర్ కు బలమైన మద్దతుగా నిలిచి ఆయన్ను పీఠం ఎక్కించడంలో కీలక పాత్ర పోషిస్తే.. ఇప్పుడు కేసీఆర్ మాత్రం కోదండరాంకు ఖో చెబుతున్నారు.
తెలంగాణ కోసం ఉద్యమాలు చేసినప్పుడు ఉద్యమసంఘాలన్నీ మద్దతు పలికాయి. ఇప్పుడూ అన్ని సంఘాల మద్దతూ ఆయనకు ఉంది. అలాంటి సమయంలో కేసీఆర్ అండ కూడా కోదండకు ఉంది. కానీ ఇప్పుడు అందరూ ఉన్నా.. కేసీఆర్ తోడుగా లేరు. కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదు. అమరుల స్ఫూర్తియాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారు.
ధర్నా చౌక్ తరలింపుపై ఇప్పటికే విపక్షాలతో ఉద్యమం చేసిన కోదండరాం.. ఈసారి హస్తినకు వెళ్లాలనుకుంటున్నారు. బీజేపీ నైతిక మద్దతు ఇస్తే.. అక్కడ కూడా ధర్నా చేద్దామనుకుంటున్నారు. జంతర్ మంతర్ దగ్గర స్థలం ఉన్నా.. మద్దతిచ్చేవారెవరన్నేదానిపైనే చర్చ జరుగుతోంది. కేసీఆర్ తో మోడీకి మంచి సంబంధాలున్నాయి కాబట్టే కోదండరాం ఇక్కడ కూడా ఒంటరయ్యాడు.
మరిన్ని వార్తలు: