Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఈనెల 27 న విజయవాడ రాబోతున్నారు. ఎందుకంటే…దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ కోసం ఒకప్పుడు దుర్గమ్మ తల్లికి మొక్కిన మొక్కు తీర్చుకోబోతున్నారు. అమ్మవారికి ముక్కు పుడక సమర్పించబోతున్నారు. తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న సమయంలో తన కల ఫలించాలని కెసిఆర్ ఎన్నో మొక్కులు మొక్కారు. అందులో చాలా వరకు తీర్చారు. తిరుమల శ్రీవారికి స్వర్ణ సాలిగ్రామ మారం, స్వర్ణ కంఠాభరణాలు, కురవి వీరభద్రుడికి బంగారు మీసం, వరంగల్ భద్రకాళి అమ్మవారికి బంగారు కిరీటం, స్వర్ణ పత్రాలు ఇప్పటికే మొక్కు తీర్చుకున్నారు. ఇప్పుడు బెజవాడ కొండపై వున్న దుర్గమ్మ తల్లికి ముక్కుపుడక సమర్పించడానికి కుటుంబ సమేతంగా విజయవాడ వస్తున్నారు.
మరిన్ని వార్తలు: