అక్కడ నో సెన్సార్ , నో ఫిల్టర్ అంటున్న ప్రకాష్ రాజ్.

kerala on e state where i can breathe without fear says actor prakash raj AT IFFk

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
జస్ట్ అస్కింగ్ అంటూ ప్రధాని మోడీ దగ్గర నుంచి భావస్వేచ్ఛకు అడ్డు వస్తున్న అందరినీ ఉతికి ఆరేస్తున్న నటుడు ప్రకాష్ రాజ్ ఇప్పుడు ఏది మాట్లాడినా సంచలనమే. గౌరి లంకేశ్ హత్య దగ్గర నుంచి భావ స్వేచ్చకు సంకెళ్లు వేసే ప్రతి ఒక్కరినీ ఆయన నిలదీస్తున్నారు. ఈ క్రమంలో ఆయన బీజేపీ , దాని అనుకూల సంస్థలకు మింగుడుపడడం లేదు. ఓ కళాకారుడిగా సామాజిక పరిణామాల మీద గొంతు ఎత్తడం తన బాధ్యత అంటున్న ప్రకాష్ రాజ్ ఓ రాష్ట్రం మీద ప్రశంసలు కురిపించాడు.

kerala one state

కేరళ అంతర్జాతీయ చిత్రోత్సవం ప్రారంభ వేడుకల్లో ప్రకాష్ రాజ్ తన మనసులోని మాట బయటపెట్టారు. తాను నిర్భయంగా ఊపిరి తీసుకునే ప్రాంతం కేరళ అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ రాష్ట్రంలో ఏమి మాట్లాడాలో ముందుగా స్క్రిప్ట్ తీసుకొచ్చే పనిలేదని , ఇక్కడ సెన్సార్ , ఫిల్టర్ లేకుండా మాట్లాడే స్వేచ్ఛ ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక “సెక్సీ దుర్గ “ సినిమా టైటిల్ మీద వస్తున్న విమర్శల్ని కూడా ప్రకాష్ రాజ్ తప్పుబట్టారు . ఈ సినిమా టైటిల్ ని తప్పుబట్టే వాళ్ళు ముందుగా దుర్గ వైన్స్ , దుర్గ బార్ ల మీద దాడి చేయాలని వ్యంగ్యంగా సూచించారు . రాజకీయాలతో సంబంధం లేదంటూనే కేరళలో ప్రకాష్ రాజ్ మాట్లాడిన ప్రతి మాట బీజేపీ ని ఇబ్బందిపెట్టేలా , వామపక్షాలకు మద్దతు ఇచ్చేలా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయినా ప్రకాష్ రాజ్ దూకుడు ఇప్పట్లో ఆగేలా లేదు.