Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
“లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమా ప్రకటనతో వెలిగిపోయిన లక్ష్మీపార్వతి మొహం “ లక్ష్మీస్ వీరగ్రంధం “ అనౌన్స్ మెంట్ తో చిన్నబోయింది. ఆ సినిమాని ఆపడానికి కోర్టుని ఆశ్రయిస్తానని ఓ వైపు లక్ష్మీపార్వతి చెబుతున్నప్పటికే “లక్ష్మీస్ వీరగ్రంధం “ దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఏ మాత్రం లెక్కచేయడం లేదు. పైగా ఆమె గతాన్ని తవ్వడానికి లక్ష్మీపార్వతి కి సంబంధం వున్న అన్ని ఊళ్ళకి వెళుతున్నాడు. ఈ కోవలో ముందుగా లక్ష్మీపార్వతి మాజీ భర్త వీరగంధం సుబ్బారావు స్వగ్రామం వెళ్ళాడు. ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా లోని ఈదర భీమవరం గ్రామాన్ని కేతిరెడ్డి టీం సబందర్శించింది. సుబ్బారావు కుటుంబం, ఆయన బంధువులు, వివాహం తదితర విషయాల గురించి స్థానికుల దగ్గర సమాచారం సేకరించింది. అక్కడి ప్రజలు కేతిరెడ్డి బృందానికి వీరగంధం సుబ్బారావు తో పాటు లక్ష్మీపార్వతి గురించి అరుదైన, విలువైన సమాచారం ఇచ్చారట.
“లక్ష్మీస్ వీరగ్రంధం “ టీం ఆ తర్వాత గుంటూరు జిల్లా వినుకొండని సందర్శించింది. అక్కడ ఎన్నో ఏళ్ల కిందట ఎన్టీఆర్ చేతులు మీదుగా మొదలైన వీరగంధం కళాకేంద్రాన్ని కేతిరెడ్డి బృందం చూసింది. హరికథలు చెప్పడంలో దిట్ట అయిన సుబ్బారావు గొప్పదనాన్ని అప్పట్లో ఎన్టీఆర్ కూడా గుర్తించారు. ఆ తర్వాత సుబ్బారావు వివాహం చేసుకున్న లక్ష్మీపార్వతి ఆయనకు విడాకులు ఇచ్చి ఎన్టీఆర్ ని వివాహం చేసుకోవడం చిత్రం. ఇలా జరగడానికి దారి తీసిన పరిస్థితులు మీద దృష్టి పెట్టింది లక్ష్మీస్ వీరగ్రంధం టీం. ఇలా లక్ష్మీపార్వతి గతాన్ని తవ్వుకుంటూ ఆ బృందం ఊళ్లు తిరగడాన్ని ఆమె జీర్ణించుకోవడం కష్టమే. అయితే “లక్ష్మీస్ ఎన్టీఆర్ “ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ముందే ఈ పరిణామాలు ఊహించివుంటే బాగుండేది.