మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రంలో జోడీ కట్టిన కైరా అద్వానీ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఈమె నటించిన హిందీ చిత్రం ‘లస్ట్ స్టోరీస్’లో శృంగార కోరికలు ఎక్కువగా గల గృహిణిగా నటించి వైబ్రేటర్‌తో ఉన్న సన్నివేశం ద్వారా ఇంటర్ నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సీన్‌పై పలు విమర్శలు తలెత్తుతుంటే మహిళల లైంగిక వాంఛలకు సంబంధించిన అంశాల్ని తెరకెక్కించడాన్ని సరిదిద్దుకోలేని తప్పుగా అభివర్ణించడం కరెక్ట్ కాదంటుంది కైరా అద్వానీ. అలాగే సెక్స్ విషయంలో తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసింది. ‘సెక్స్ అనేది ప్రేమను వ్యక్తపరిచే సాధనమని దాన్ని బూతుగా చూడాల్సిన అవసరం లేదని, తనకు 15 ఏళ్లు వయసు ఉన్నప్పుడు సెక్స్ ప్రక్రియ గురించే అవగాహన లేక.. అది పెళ్లి తరువాత జరగాల్సిన తంతుగా భావించానని చెప్పుకొచ్చింది. పెళ్లికి ముందు సెక్స్ చాలా తప్పు అని భావించే దానినని కానీ సినిమాల్లోకి వచ్చిన తరువాత సెక్స్‌పై అభిప్రాయం మారిందని శృంగారం అనేది వాళ్ల వాళ్ల వ్యక్తిగత అభిప్రాయం అంటూ శృంగారం గురించి చెప్పుకోచ్చిందీ వసుమతి.