విదేశాంగ మంత్రికి కిషన్ రెడ్డి లేఖ

మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

దుబాయ్‌లో ఓ పాకిస్థానీ యువకుడి చేతిలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. వారు పనిచేస్తున్న బేకరీలోనే అతి దారుణంగా నరికి చంపారు. ఈ దాడిలో మరో ఇద్దరు తెలుగు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి స్పందించి విదేశాంగ మంత్రికి లేఖ రాశారు. ఈ విషయంలో చొరవతీసుకుని మృతదేహాలను వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకురావడంలో సహకరించాలని కోరారు.