తెలంగాణను కేసీఆర్ కుటుంబమంతా దోచుకుందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ తన కుటుంబాన్ని బంగారు కుటుంబంగా చేసుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మార్పు తెస్తామని చెప్పి రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చారని కానీ ఆచరణలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి.. ప్రకటనలు ఫస్ట్ పేజీల్లో ఉన్నాయి.. పనులు మాత్రం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. మంత్రుల్లో సఖ్యత లేదని, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ ఎన్నికల తీర్పు రానుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అవినీతికి పెద్దపీట వేశారని ఆరోపించారు.