Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలంగాణ మంత్రి కేటీఆర్ కు తండ్రి కేసీఆర్ కంటే నోటి దురుసు ఎక్కువే అని అందరికీ తెలుసు. ముఖ్యంగా ట్విట్టర్ వేదికగా రాజకీయ ప్రత్యర్థులపై చెణుకులు విసరడంతో ఆయన ఆరితేరారు. ఆయన్ను ఎవరైనా విమర్శిస్తే ఎక్కడలేని కుంటిసాకులు చెప్పే కేటీఆర్.. కేంద్రమంత్రి పదవి కోల్పోయి బాథలో ఉన్న దత్తాత్రేయపై విమర్శలకు దిగడం.. చర్చనీయాంశమైంది.
కేంద్ర క్యాబినెట్లో కొత్తగా చేరిన మంత్రులకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేసిన కేటీఆర్.. దత్తాత్రేయ తెలంగాణకు చెప్పుకోదగ్గ పనేదీ చేయకపోయినా.. క్యాబినెట్లో తెలంగాణకు ప్రాతినిథ్యం లేకపోవడం మాత్రం బాగోలేదని కామెంట్ చేశారు. ఈ కామెంట్ చూసిన దత్తన్న సన్నిహితులు ఆయనకు చేరవేశారు. దీంతో కేసీఆర్ తో ఎంతో క్లోజ్ గా ఉండే దత్తన్న.. ఆయన కొడుకే ఇలా అనడం చూసి చాలా బాథపడ్డారట.
నిజానికి టీఆర్ఎస్ కారణంగానే దత్తన్న పదవి పోయిందనే వాదన ఉంది. గతంలో కేసీఆర్ తో కలిసి రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు వెళ్లడం, చివరకు కేంద్రమంత్రిగా తెలంగాణ సర్కారు పంచాంగ శ్రవణంలో పాల్గొనడం, అదే రోజు బీజేపీ ఆఫీస్ లో జరిగిన పంచాంగ శ్రవణానికి గైర్హాజరు కావండ వంటి కారణాలన్నీ కలిసొచ్చి.. అమిత్ షా దత్తన్న పోస్టు పీకేశారని ప్రచారం జరుగుతోంది.
మరిన్ని వార్తలు: