Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నంద్యాల, కాకినాడ ఫలితాలు చూసాక రాజకీయంగా పెద్ద దిక్కు లేకుండా ముందుకు వెళ్లడం సరికాదని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారట. ఆ స్థానాన్ని ప్రశాంత్ కిషోర్ లా అరువు తెచ్చుకున్న వ్యక్తికి కాకుండా తన అనుకునే వాళ్ళు అయితే బాగుంటుందని జగన్ కి భార్య, కుటుంబ సభ్యులు సలహా ఇచ్చారట. ఎప్పుడూ ఇంకోరి మాట వినని జగన్ ఈసారి సరే అనడంతో పాటు వెంటనే రంగంలోకి దిగారట. ఆ పెద్ద దిక్కు ఒకప్పుడు తన తండ్రికి ఆత్మ గా చెప్పుకునే కేవీపీ రామచంద్రరావు లాంటి వాళ్ళు అయితే బాగుంటుందని జగన్ అనుకున్నారట. అనుకున్నదే తడవుగా వై.ఎస్ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో జరిగే కార్యక్రమానికి హాజరు కావాలని కేవీపీ కి పిలుపు వెళ్లిందట. ఆయన కూడా అక్కడికి వెళ్లారట.
ఇడుపులపాయ వేదికగా గురించి జగన్, కేవీపీ సుదీర్ఘంగా చర్చించుకుని అభిప్రాయ బేధాలు తొలిగించుకున్నారట. తనని పిలిచినా, పిలవకపోయినా నిన్ను సీఎం చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటానని కేవీపీ చెప్పడంతో జగన్ ఖుషీ అయ్యారంట. అయితే చంద్రబాబుని రాజకీయంగా ఎదుర్కోవాలంటే ఇప్పుడున్న స్థాయి సన్నద్ధత సరిపోదని కూడా జగన్ ముందు కేవీపీ కూడా కుండ బద్దలు కొట్టారట. అదే అదనుగా తీసుకున్న జగన్ మామ కేవీపీ ముందు ఓ ప్రతిపాదన పెట్టారట. నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాల తర్వాత డీలా పడ్డ పార్టీ శ్రేణుల్ని ఉత్సాహపరచడానికి మీరు పార్టీ లో చేరితే బాగుంటుందని కేవీపీ ని జగన్ అడిగారట. అయితే దానిపై నిర్దిష్ట అభిప్రాయం చెప్పకుండానే కేవీపీ మాట దాటవేశారట. ఆ తర్వాత విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సమీక్షా సమావేశంలోనూ కేవీపీ అంత చురుగ్గా లేకపోవడాన్ని గమనించిన వైసీపీ ముఖ్య నేత ఆయన తమ పార్టీలో చేరే అవకాశం లేకపోలేదని కామెంట్ చేశారు. జగన్ ప్రయత్నాలు ఫలించి కేవీపీ వైసీపీ లోకి వెళితే ఆంధ్ర రాజకీయాలు కీలక మలుపు తీసుకున్నట్టే.
మరిన్ని వార్తలు: