Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
” లక్ష్మీస్ ఎన్టీఆర్ ” సినిమా కి వైసీపీ నాయకుడు రాకేష్ రెడ్డి నిర్మాత అని సాక్షాత్తు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించాడు. దీంతో ఆ సినిమా వెనుక వైసీపీ అధినేత జగన్ హస్తం ఉందన్న వ్యాఖ్యలు ఊపు అందుకున్నాయి. సోమిరెడ్డి లాంటి వాళ్ళు నోరు ఎత్తడం, రామ్ గోపాల్ వర్మ కౌంటర్ చేయడంతో మొత్తం రచ్చ రచ్చ అవుతోంది. దీంతో వర్మతో పాటు వైసీపీ తరపున కూడా కొందరు ఇప్పుడిప్పుడే గొంతు ఎత్తుతున్నారు. ఈ సినిమాకి కేంద్ర బిందువు లాంటి లక్ష్మీపార్వతి కూడా ఈ అంశం మీద నోరు విప్పారు.
” లక్ష్మీస్ ఎన్టీఆర్ ” నిర్మాణం వెనుక వైసీపీ అధినేత జగన్ హస్తం ఉందనడంలో నిజం లేదని లక్ష్మీపార్వతి అంటున్నారు. ఎన్నికలప్పుడే ఏ మాత్రం ఖర్చు పెట్టని జగన్ ‘ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి’ మీద సినిమా కోసం ఖర్చు పెడతారా అని ఆమె ఎదురు ప్రశ్నించారు. జగన్ ఆ ఖర్చు ఏదో పెట్టి ఉంటే 2014 ఎన్నికల్లోనే వైసీపీ గెలిచేదని, అలా చేయలేదని వైసీపీ నేతలు ఎంతో మంది బాధపడుతుంటారని లక్ష్మీపార్వతి కామెంట్ చేశారు. “లక్ష్మీస్ ఎన్టీఆర్ ” వెనుక జగన్ హ్యాండ్ లేదని చెప్పడం కోసం నోరు విప్పిన లక్ష్మీపార్వతి తెలిసో తెలియకో ఆయన గాలి తీసేలా మాట్లాడింది.