తమిళ స్టార్ నటుడు థలా అజిత్ కుమార్ హీరోగా ఇప్పుడు దర్శకుడు మగిజ్ తిరుమనేని తో “విడా ముయార్చి” అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ మూవీ షూటింగ్ మధ్యలోనే అజిత్ ఆకస్మికంగా హాస్పిటల్ లో జాయిన్ కావడం ఫ్యాన్స్ లో కాస్త టెన్షన్ ను తెచ్చి పెట్టింది. అయితే అజిత్ కే వెళ్లారని మళ్ళీ తిరిగి మూవీ షూటింగ్ లో కూడా పాల్గొంటాడని తమిళ సినీ వర్గాలు చెప్పాయి.
అయితే ఇప్పుడు తన హెల్త్ కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది. అజిత్ ఇవాళే డిశ్చార్జ్ కాగా ఇంకా తనకి బెడ్ రెస్ట్ అవసరం ఉందని డాక్టర్స్ సూచించారంట . అజిత్ మొత్తం చెకప్ చేయించుకున్నాడని అందుకే కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నాక విడా ముయార్చి షూటింగ్ లో తాను పాల్గొంటారని కోలీవుడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇక ఈ మూవీ కి అనిరుద్ సంగీతం అందిస్తుండగా లైకా ప్రొడక్షన్స్ వారు ప్రెస్టీజియస్ గా ఈ మూవీ కి నిర్మాణం వహిస్తున్నారు.