లావణ్య ఫేక్‌ న్యూస్‌ అలర్ట్…!

Lavanya Tripathi Feels Very Bad For Missed Geetha Govindam And Tholiprema

‘అందాల రాక్షసి’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయిన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా కూడా స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకోలేక పోయింది. ఇప్పటి వరకు లావణ్య త్రిపాఠికి కమర్షియల్‌గా భారీ సక్సెస్‌లను దక్కించి పెట్టలేదు. ఇక కొన్ని చిత్రాలు సక్సెస్‌ అయినా కూడా ఆమెకు మాత్రం పేరు తెచ్చి పెట్టలేదు. దాంతో లావణ్య త్రిపాఠి అదృష్టం బాగా లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా లావణ్య త్రిపాఠి ‘గీత గోవిందం’ మరియు ‘తొలిప్రేమ’ చిత్రాలను కథలు బాగా లేవు, దర్శకుడిపై నమ్మకం లేదు అంటూ తిరష్కరించడం జరిగింది. ఆ రెండు చిత్రాలు కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. సోషల్‌ మీడియాలో లావణ్య త్రిపాఠి చేసిన తప్పుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Missing the two hit movies

‘గీత గోవిందం’ చిత్రాన్ని మిస్‌ అవ్వడం లావణ్య త్రిపాఠి జీవితంలో చేసిన పెద్ద తప్పు అంటూ అంతా కూడా కామెంట్‌ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో లావణ్య త్రిపాఠి క్లారిటీ ఇచ్చింది. తన గురించి మీడియాలో వస్తున్న వార్తలు ఫేక్‌ న్యూస్‌ అంటూ తేల్చి చెప్పింది. లావణ్య త్రిపాఠి సోషల్‌ మీడియాలో ఈ విషయమై స్పందిస్తూ ఫేక్‌ న్యూస్‌ అలర్ట్‌ అంటూ ట్వీట్‌ చేయడం జరిగింది. దాంతో పాటు తన గురించి మీడియాలో వస్తున్న వార్తల గురించి స్పందించనట్లయితే అవి నిజం అయిపోవు అంటూ ట్వీట్‌ చేసింది. సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం అన్ని వేళ్లలో నిజం కాకపోవచ్చు అనే విషయాన్ని జనాలు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అంటోంది. మొత్తానికి గీత పాత్రను తాను మిస్‌ కాలేదు అని, అసలు ఆ పాత్ర తన వద్దకు రాలేదు అంటూ చెప్పకనే చెప్పింది.

lavyanya-tripati