Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘అందాల రాక్షసి’ లావణ్య త్రిపాఠి తాజాగా ‘యుద్దం శరణం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా ప్రేక్షకులను అలరించలేక పోయింది. దాంతో లావణ్య త్రిపాఠికి అవకాశాలు రావడమే కష్టం అయ్యింది. యుద్దం శరణంకు ముందే అర్జున్‌రెడ్డి హీరో విజయ్ దేవరకొండతో గీతాఆర్ట్స్‌లో తెరకెక్కుతున్న సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్గా ఎంపిక అయ్యింది. ఆ సినిమా నుండి కొన్ని కారణాల వల్ల ఆమెను తొలగించడం జరిగింది. మరో వైపు తమిళంలో తెరకెక్కబోతున్న ‘100% లవ్’ చిత్రంలో ఈమెను హీరోయిన్గా ఎంపిక చేయడం జరిగింది.
విజయ్‌దేవరకొండ చిత్రంలో తనను తొలగించడానికి కారణం తమిళ ‘100% లవ్’ చిత్ర దర్శకుడు అని లావణ్య త్రిపాఠి భావించి ఆ సినిమాలోంచి తప్పుకుంది. ఉన్నట్లుండి చెప్పా పెట్టకుండా ఆమె తప్పుకోవడంతో చిత్ర యూనిట్ సభ్యులకు భారీ నష్టం వాటిల్లిందట. లావణ్య త్రిపాఠితో పాటు ఇంకా ఇతర చిత్ర యూనిట్ సభ్యులతో విదేశాల్లో మొదటి షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. అందుకు అన్ని సిద్దం అయిన తర్వాత ఈమె హ్యాండ్ ఇవ్వడంతో షెడ్యూల్ అంతా అప్సెట్ అయ్యింది. దాంతో చాలా నష్టం వాటిల్లిందని, అందుకు లావణ్య త్రిపాఠి బాధ్యత వహించాలంటూ తమిళ నిర్మాత అంటున్నాడు. వెంటనే తమకు ఏర్పడిన నష్టంను భర్తీ చేయాలని లేదంటే కోర్టుకు వెళ్తాం అంటూ లావణ్యను సదరు నిర్మాత హెచ్చరించాడు. దాంతో ఆమె పెద్ద చిక్కుల్లో పడ్డట్లయ్యింది.