Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నన్ను పప్పు అని కొంతమంది బతికేస్తున్నారు. అంత మాత్రాన నాకు వచ్చే నష్టం లేదు. నా ద్వారా పాపులర్ అవ్వాలని చూస్తున్నారంటే.. నేను ఆల్ రెడీ సక్సెస్ సాధించినట్లే అంటున్నారు ఏపీ మంత్రి లోకేష్. ఇప్పటికే సోషల్ మీడియా, యూట్యూబ్ లో లోకేష్ సెటైరికల్ వీడియోస్ సందడి చేస్తున్న తరుణంలో.. ఆయన ఇంత పాజిటివ్ గా రియాక్ట్ కావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
విమర్శలకు కూడా హద్దు ఉందని, వ్యక్తిగతంగా ఓ మనిషిని కించపరిచి బతికేద్దామనుకుంటే జాలిపడటం తప్ప ఏమీ చేయలేమంటున్నారు లోకేష్. తాను పప్పు అయితే మంత్రిగా ప్రజలకు కనెక్టయ్యే పథకాలు ఎలా రూపొందించానని లోకేష్ ప్రశ్నించారు. వైసీపీ ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకుని.. ప్రతిపక్ష పార్టీగా బాధ్యతాయుతంగా ఉండాలని హెచ్చరించారు లోకేష్.
లోకేష్ పప్పు కామెంట్లను తిప్పికొట్టడంపై టీడీపీలో ఆనందం వ్యక్తమవుతోంది. లోకేష్ కు రాజకీయ పరిణతి లేదంటున్నవారు ఇప్పుడేమంటారని వారు ఎదురు ప్రశ్నిస్తున్నారు. తమ నేత కాబట్టి ఇంత కూల్ గా ఆన్సర్ ఇచ్చారని, అదే జగన్ ను పప్పు అంటే ఈ పాటికి నేల, ఆకాశం ఏకమయ్యేలా అక్కసు వెళ్లగక్కేవారని వాళ్లు గుర్తుచేశారు. ఉన్న కేసులు చెబితేనే అసహనం వ్యక్తం చేస్తున్న జగన్.. లోకేష్ ను పప్పు అనిపించడం హాస్యాస్పదమని కామెంట్ చేస్తున్నారు టీడీపీ జనాలు.
మరిన్ని వార్తలు:
అధికారం వచ్చినా.. బుద్ధి మారలేదు
డిగ్గీని వదిలేసిన కాంగ్రెస్
రానా పార్సిల్ లో ఏముంది..?