Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు సినిమా పరిశ్రమలో ఆడవారికి భద్రత లేదని, కొత్తగా అవకాశాల కోసం వచ్చే వారికి తీవ్ర స్థాయిలో లైంగిక వేదింపులు తప్పడం లేదు అంటూ శ్రీరెడ్డి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో హల్ చల్ చేస్తున్న విషయం తెల్సిందే. మహిళలపై లైంగిక వేదింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిందే అంటూ సీఎం కేసీఆర్ను కోరుతూ శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శణకు దిగిన విషయం తెల్సిందే. ఫిల్మ్ ఛాంబర్ వద్ద శ్రీరెడ్డి చేసిన పనికి మా కార్యవర్గం సీరియస్గా స్పందించింది. ఆమెను మా లోకి తీసుకునేది లేదు అంటూ తేల్చి చెప్పడంతో పాటు ఆమెతో కలిసి నటించిన వారిపై కూడా కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొనడం జరిగింది.
శ్రీరెడ్డిపై మా తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతుంది. ఆమె తనకు జరిగిన అన్యాయంను తెలిపేందుకు ప్రయత్నాలు చేస్తుందని, సినిమా ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితులను ఆమె మార్చాలనే ఉద్దేశ్యంతోనే చేస్తుందని, అయితే ఆమె చేస్తున్న మార్గం సరిగా లేదని, అంత మాత్రాన ఆమెకు మా లో సభ్యత్వం ఇవ్వక పోవడంతో పాటు, ఆమెను పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంచాలనే ప్రయత్నం మా చేయడం ఏమాత్రం సమంజసం కాదని, ఇండస్ట్రీ పరువు తీసిన వారు ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్నారు. వారిని కాదని కేవలం శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవడం ఏంటనీ కొందరు మా కార్యవర్గంను ప్రశ్నిస్తున్నారు.