శ్రీరెడ్డి లీక్స్‌ ఆగేనా?

MAA Association take U turn On Sri Reddy Ban

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

గత కొన్నాళ్లుగా ఇండస్ట్రీని వణికిస్తున్న శ్రీరెడ్డి లీక్స్‌ను అడ్డుకునేందుకు పెద్దలు రంగంలోకి దిగారు. శ్రీరెడ్డిపై మా కార్యవర్గ సభ్యులు బ్యాన్‌ విధించిన నేపథ్యంలో ఆమె మరింతగా రెచ్చి పోయింది. పెద్ద పెద్ద వారిపై ఆరోపణలు చేయడంతో పాటు, తన వద్ద ఉన్న సాక్ష్యాలను కూడా బయట పెట్టి, పెద్దల బండారంను బట్టబయలు చేసింది. దాంతో మా సభ్యులు మళ్లీ రంగంలోకి దిగారు. ఇటీవల మా సభ్యులు ఎవ్వరు కూడా శ్రీరెడ్డితో నటించకూడదని బ్యాన్‌ విధంగారు. అయితే ఆ బ్యాన్‌ను ఎత్తి వేస్తున్నట్లుగా మా ప్రకటించింది. మా సభ్యులు శ్రీరెడ్డితో నటిస్తే ఎలాంటి చర్యలు తీసుకోబోమని ప్రకటించారు.

శ్రీరెడ్డి తనపై వేసిన బ్యాన్‌ను ఎత్తివేసిన కారణంగా ఇప్పటికైనా లీక్స్‌ను ఆపేనా అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. శ్రీరెడ్డి కోరినట్లుగా టాలీవుడ్‌లో ఆడవారిపై జరుగుతున్న అకృత్యాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. మా సభ్యులతో పాటు నిర్మాతల మండలి మరియు దర్శకుల సంఘం అంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చి కమిటీ వేయడం జరిగింది. మొత్తానికి శ్రీరెడ్డి కోరుకున్నట్లుగా జరిగింది కనుక ఇకపై ఆమె నుండి లీక్స్‌ ఉండవని భావిస్తున్నారు. అయితే మా కార్యవర్గ సభ్యులు మరియు ఇతర సినిమా పరిశ్రమ వారి మాటలను శ్రీరెడ్డి నమ్మే పరిస్థితి లేదు. దాంతో శ్రీలీక్స్‌ ఆగవని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.