నేనైతే కత్తి మహేష్‌ను చెప్పు తీసుకుని కొడతా

Madhavi Latha comments on Kathi Mahesh

ఇటీవల కత్తి మహేష్‌ గురించి మళ్లీ మీడియాలో ప్రముఖంగా కథనాలు వస్తున్నాయి. ఒక టీవీ ఛానెల్‌ డిస్కషన్‌లో కత్తి మహేష్‌ మాట్లాడుతూ రామాయణం మరియు రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఇప్పటికే కత్తి మహేష్‌పై పోలీస్‌ కేసు నమోదు అవ్వడం మరియు ఆయన్ను పోలీసులు అరెస్ట్‌ చేసి ఎంక్వౌరీ చేయడం జరుగుతుంది. ఈ సమయంలోనే కత్తి మహేష్‌పై పలువురు పలు రకాలుగా విమర్శలు చేస్తున్నారు. ఇటీవలే నాగబాబు మాట్లాడుతూ ఇలాంటి వ్యక్తుల వల్ల మతసామరస్యం దెబ్బ తినే అవకాశం ఉందని, అందుకే ఇలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలంటూ తెలుగు రాష్ట్రాల సీఎంలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. తాజాగా సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవిలత కూడా ఈ విషయమై మాట్లాడటం జరిగింది.

ఒక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాధవిలత మాట్లాడుతూ తాను ఒక బీజేపీ నాయకురాలిగా కాకుండా ఒక సామాన్యురాలిగా మాట్లాడుతున్నాను అంటూ కత్తి మహేష్‌ చేసిన వ్యాఖ్యలకు తానైతే చెప్పుతో కొడతాను అని, అతడు ఎవడండీ రాముడి గురించి, రామయణం గురించి మాట్లాడటానికి. సీతదేవి రాముడితో ఉంటే ఎంజాయ్‌ చేసేది అంటూ అతడు మాట్లాడిన మాట ఎంత దారుణం. సీతను అంతా కూడా గౌరవంగా పూజిస్తారు, మహిళలు అంతా కూడా సీతను ఆదర్శంగా తీసుకుంటారు. అలాంటి సీతను కామెంట్‌ చేస్తాడు. అతడి కామెంట్‌ను పూర్తిగా ఖండిస్తున్నాను. అతడు వేరే మతాల దైవాల గురించి ఇలా మాట్లాడగలడా, అతడు ఇతర మతాల దేవతల గురించి కామెంట్స్‌ చేయగలడా, ఆ సత్తా ఉందా అంటూ కత్తి మహేష్‌ను ఉద్దేశించి మాధవిలత ఆగ్రహం వ్యక్తం చేసింది. కత్తి మహేష్‌ వేశాలు చూడలేక అతడి భార్య వదిలేసి వెళ్లి పోయిందని, వీడు ఇప్పుడు రోడ్డున పడి తిరుగుతున్నాడు అంటూ మాధవిలత కామెంట్‌ చేసింది.